Puneeth Rajkumar: కన్నడ పవర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ 29న ఆకస్మిక గుండెపోటుతో మరణించారు.ఇలా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ మరణించారనే విషయాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలను చేసి నిజమైన హీరో అని ముద్ర వేయించుకున్నారు.
ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ మరణం అభిమానులను మాత్రమే కాకుండా సెలబ్రిటీలను సైతం కృంగదీసిందని చెప్పాలి.ఇక ఈయన మరణానంతరం ఆయన సేవలకు గుర్తుగా పలువురు సెలబ్రిటీలు ఎన్నోరకాల సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ క్రమంలోనే పునీత్ రాజ్ కుమార్ పై ఉన్న అభిమానంతో నాగిని 2 ఫేమ్ నమ్రత గౌడ్ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశం గా మారింది.
ఈమె పునీత్ రాజ్ కుమార్ కువిపరీతమైన అభిమాని ఈ క్రమంలోనే తమ అభిమాన నటుడు మరణించడంతో జీర్ణించుకోలేక పోయిన ఈమె ఏకంగా తన అభిమాన నటుడు పునీత్ రాజ్ కుమార్ పేరును తన చేతి పై టాటుగా వేయించుకున్నారు.ఈ క్రమంలోనే నమ్రత గౌడ్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేయడంతో ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇలా ఈ ఫోటోని, వీడియోని షేర్ చేసిన నమ్రత ఫరెవర్ అంటూ క్యాప్షన్ పెట్టింది. ఇక ఈమె ఈ టాటూని పునీత్ జయంతి సందర్భంగా మార్చి 17వ తేదీ తన పేరును టాటూగా వేయించుకున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం ఈ ఫోటో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఇది చూసిన పునీత్ ఫ్యాన్స్ అంతా తన పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే మరి కొందరు ఇదే కదా అభిమానం అంటే అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…