Hero Nikhil: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నేడు మధ్యాహ్నం నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ అకాల మరణం పొందారు. దీంతో నిఖిల్ ఇంట ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ క్రమంలోనే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మృతి చెందారనే వార్త తెలియగానే ఎంతోమంది నిఖిల్ సన్నిహితులు, బంధుమిత్రులు సినీ ప్రముఖులు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు.
అయితే నిఖిల్ తండ్రి ఇలా అకాల మరణం పొందడానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. నిఖిల్ హీరోగా ఇండస్ట్రీలో ఎదగడానికి తన తండ్రి శ్యామ్ సిద్ధార్థ పాత్ర ఎంతో ఉంది. ఇలా తన తండ్రితో తనకున్న అనుబంధం గురించి నిఖిల్ ఎన్నోసార్లు మీడియాతో ముచ్చటించారు.
ఈ విధంగా తన తండ్రితో ఎంతో మంచి అనుబంధం ఏర్పరుచుకున్న నిఖిల్ కి నేడు పితృ వియోగం కలిగింది. ఈ విధంగా తండ్రి మరణవార్తను విన్న నిఖిల్ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఇక ఈ వార్త తెలియగానే పలువురు సినీ ప్రముఖులు నిఖిల్ కు ఫోన్ చేసి వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. అయితే నిఖిల్ తండ్రి శ్యామ్ సిద్ధార్థ్ మరణానికి గల కారణం ఏమిటి అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈయన గుండెపోటుతో మరణించారా లేక ఇతర అనారోగ్య సమస్యలతో మరణించారా అన్ని విషయాలు తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…