నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ చిట్కాలు ఫాలో కావాల్సిందే!

ఆధునిక యుగంలో మారుతున్న కాలానుగుణంగా మన జీవన విధానంలోనూ, ఆహారపు అలవాట్లలోను భిన్నమైన మార్పులు సంతరించుకున్నాయి.ప్రస్తుతం మనం ఫాస్ట్ ఫుడ్ కు అలవాటు పడి అనేక వ్యాధులతో నిత్యం పోరాడుతూనే ఉన్నాం.అలాంటి సమస్యలలో నిద్రలేమి సమస్య ప్రధానమైనదిగా చెప్పవచ్చు.నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడేవారు భవిష్యత్తులో ప్రమాదకరమైన వ్యాధుల బారినపడే అవకాశాలు చాలా ఉన్నాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

నిద్రలేమి సమస్యతో సతమతమయ్యే వారు ఎక్కువగా నిద్ర మాత్రలకు,మద్యపానానికి బానిసలుగా మారి ఏరికోరి మరిన్ని వ్యాధులను కొనితెచ్చుకుంటున్నారు. అలా కాకుండా సహజమైన, ప్రశాంతత కలిగిన సుఖమైన నిద్ర కోసం ప్రతిరోజు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే నిద్రలేమి సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజు ఉదయం సాయంత్రం కొంత శారీరక శ్రమ కలిగిన వ్యాయామం,నడక వంటివి చేస్తూ ఉండాలి.
మన పడక గది సాధ్యమైనంత వరకూ ప్రశాంతంగా, శుభ్రంగా ఉండునట్లు చూసుకోవాలి. అదేవిధంగా
రాత్రి నిద్రించే ముందు గోరువెచ్చని పాలు తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే రాత్రిపూట వీలైనంత వరకు కాఫీ, టి,కూల్ డ్రింక్స్, ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ జోలికి పోకూడదు.

నిద్ర పోవడానికి ముందు స్మార్ట్ ఫోన్,ల్యాప్‌టాప్ ఎక్కువగా చూసినట్లయితే బ్లూ లైట్ కారణంగా కళ్లపై ఒత్తిడిపెరుగుతుంది.అలాగే మొబైల్ ఫోన్‌ను నిద్రపోయేటప్పుడు తలకు దగ్గర పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.నిద్రపోయే ముందు మనకి ఇష్టమైన సంగీతం వినడం, పుస్తకాన్ని చదవడం వల్ల తొందరగా నిద్రలోకి జారుకోవడం. ఈ విధంగా కొంతకాలం ప్రయత్నం చేసినట్లయితే నిద్రలేమి సమస్య నుంచి బయట పడవచ్చు.