ఇటీవల కాలంలో చాలా మంది చిరుధాన్యాల్లోని పోషక విలువలను గుర్తించి తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.అయితే ఇప్పుడు చిరుధాన్యాల్లోని ముఖ్యమైన రాగులు గురించి, ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన రాగి అంబలి తయారీ విధానం ,అందులో పోషక విలువలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రాగి చిరుధాన్యములో మన శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎక్కువ ఉంటాయి.అన్ని ఆహార ధాన్యాలు కంటే రాగిలో 7-35 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. కావున ఎముకలు దృఢంగా తయారయ్యి, కీళ్ళ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.మొలకెత్తిన రాగులలో రోగ నిరోధక శక్తి వచ్చే విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు ఒక్క గ్లాస్ రాగి అంబలి తాగినా కడుపు నిండిన భావన కలిగి ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. అలాగే బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రాగి అంబలి తరచూ తాగడం వల్ల చిన్న పిల్లల్లో మెదడు అభివృద్ధి సక్రమంగా జరిగి చురుగ్గా పనిచేస్తుంది.
ఇప్పుడు రాగి అంబాలికి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. మొదట నాణ్యమైన రాగులను మనకు కావాల్సిన పరిమాణంలో తీసుకుని కొన్ని గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి.తర్వాత వీటిని తీసి శుభ్రమైన వస్త్రంలో కట్టి ఉంచితే అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.రాగి పొడిని కావలసిన పరిమాణంలో నీటిలో వేసి బాగా ఉడికిన తర్వాత అందులోకి మీకు ఇష్టమైన జీడిపప్పు,కిస్మిస్, తేనె వంటివి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం వేసుకుంటే వేడి వేడి రుచికరమైన రాగి అంబలి తయారవుతుంది. దీన్ని ప్రతి రోజూ సేవిస్తే సకల వ్యాధి నివారణగా పనిచేస్తుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…