Featured

పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదును ఎవరు ఇచ్చారో తెలుసా ?

పవర్‌ స్టార్ పవన్ కళ్యాణ్‌ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు. మార్షల్‌ ఆర్ట్స్ ప్రదర్శనలో ఆయన గురువు పవన్‌ అనే పేరును కళ్యాణ్‌కు ముందు జోడించటంతో అప్పటి నుంచి పవన్‌ కళ్యాణ్ గా మారాడు. ఆ తర్వాత పవన్‌ అనే పేరు కళ్యాణ్ బాబుకు ఎంతో కలిసొచ్చింది. ఆ పేరుతోనే కోట్లాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతో మందికి ఆరాధ్యుడిగా మారిపోయాడు. పవన్‌ కళ్యాణ్‌ కరాటేలో బ్లాక్‌ బెల్డ్‌ సాధించాడు. కొన్ని సంవత్సరాల పాటు మార్షల్‌ ఆర్ట్స్‌ను అభ్యసించాడు.

పవన్‌ కళ్యాణ్‌ పూర్తి శాఖాహారి, ఆయన నాన్‌ వెజ్‌ అస్సలు ముట్టుకోడు. హీరోనే కాదు డైరెక్టర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, రచయితగా, సింగర్‌గా, స్టంట్‌ కో ఆర్టినేటర్‌గా, స్క్రీన్‌ప్లే రైటర్‌గా, రాజకీయ నాయకుడిగానూ తన సత్తాను చాటిన పవన్ కళ్యాణ్ సౌత్‌ ఇండియా నుంచి పెప్సీ యాడ్‌లో కనిపించిన తొలి హీరోగా తన కెరీర్ ఆరంభంలోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. పవన్‌ కళ్యాణ్‌కు క్యూబా విప్లవ వీరుడు చెగువరా అంటే చాలా ఇష్టం. అందుకే ఆయన సినిమాల్లో తరుచూ చెగువరా ఫోటోలు కనిపిస్తుంటాయి. ఇతర స్టార్స్‌ లాగ తీరిక సమయంలో పబ్‌, విదేశీ టూర్లు చేయటం పవన్‌ కళ్యాణ్ కు నచ్చదు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతూ, తన ఫాం హౌస్‌లో వ్యవసాయం చేస్తూ గడిపేస్తుంటాడు.

పవన్ కళ్యాణ్‌ ముందుగా డైరెక్టర్‌ కావాలనుకున్నాడు. కానీ చిరంజీవి సతీమణి సురేఖ ఒత్తిడితో పవన్‌ కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. పవన్‌ కళ్యాణ్ మొదటి చిత్రం “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” ఆశించినంత గా సక్సెస్ కాకపోయినా ఆ తర్వాత విడుదలైన తొలిప్రేమ చిత్రం సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు జాతీయ అవార్డుతో పాటు 6 నంది అవార్డులు వచ్చాయి. ఖుషీ, గబ్బర్‌ సింగ్‌, అత్తారింటికి దారేది చిత్రాలతో టాలీవుడ్ రికార్డ్‌లను సృష్టించిన పవన్‌ కళ్యాణ్ 1997లో నందిని అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలానికి ఆమెతో మనస్పర్దలు రావటంతో 2007లో విడాకులు తీసుకున్నాడు. ఆ తర్వాత తనతో కలిసి “బద్రి” చిత్రంలో నటించిన రేణు దేశాయిని పెళ్లి చేసుకొని ఆమెకు 2012లో విడాకులు ఇచ్చాడు. తాజాగా రష్యాకు చెందిప అన్నా లెజనోవాను మూడో వివాహం చేసుకున్నాడు పవన్‌ కళ్యాణ్.

టాలీవుడ్ ప్రముఖులతో పవన్‌ చాలా క్లోజ్ గా ఉంటాడు. లేటెస్ట్ గా గూగుల్‌ తెలియజేసిన వివరాల ప్రకారం 2014 ఎన్నికల సమయంలో అత్యధిక మంది నెటిజన్లు వెతికిన సెలబ్రిటీ పొలిటిషన్‌ పవన్‌ కళ్యాణే కావడం విశేషం. సినిమాలతో పాటు సేవా కార్యక్రమాల్లోనూ ముందే ఉండే పవన్‌, ప్రకృతి విపత్తులు సంబంధించినప్పుడు కోట్ల రూపాయల విరాళాలు ప్రకటించి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంటాడు‌. ఫాన్స్ ఫాలోయింగ్ విషయంలో నెంబర్ వన్ స్థాయికి చేరిన పవన్‌ కళ్యాణ్ అవార్డుల విషయంలో మాత్రం వెనకపడ్డాడు. కేవలం ఒకే ఒక్కసారి ప్రతీష్టాత్మక ఫిలిం ఫేర్ అవార్డును అందుకున్న పవన్‌.. ఆ తరువాత ఆ స్థాయి ప్రస్టీజియస్‌ అవార్డును అందుకోలేదు. ఇక పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదును ఎవరిచ్చారు.? అసలు ఆ పేరు ఆయనకు ఎలా వచ్చిందనే అంశాలను పరిశీలిస్తే..

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 2వ చిత్రం “గోకులంలో సీత” చిత్రం నుంచి పేరు మారింది. ఈ చిత్రం తమిళంలో హిట్టైన ‘గోకులతై సీతై’ సినిమాకు రీమేక్. సినిమా హీరోగా పవన్ కళ్యాణ్ వాయు వేగంతో దూసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో అన్నయ్య చిరంజీవితో పాటు డైరక్టర్ ముత్యాల సుబ్బయ్య అలోచించి కళ్యాణ్ ముందు పవన్ చేర్చారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి పవన్ కళ్యాణ్ ముందు పవర్ స్టార్ అనే బిరుదును ఎవరు ఇచ్చారు? ముందు ఆ పేరుతో ఎవరు పిలిచారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈమధ్యనే దొరికింది. పవర్ స్టార్ అనే పేరు మొట్ట మొదటసారిగా ప్రముఖ సినీ రచయిత పోసాని కృష్ణ మురళి నోటి నుంచి వచ్చిందంట. ఆ చిత్రానికి పోసాని కృష్ణమురళి మాటలు అందించారు. ఈ సినిమా విడుదల సందర్భంగా పోసాని కృష్ణమురళి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌ను పవర్ స్టార్ అని సంబోధించారు.

ఆ తర్వాత చాలా పత్రికలు పవన్ కళ్యాణ్ పేరు ముందు పవర్ స్టార్ బిరుదుతో కథనాలు రాయడంతో ‘గోకులంలో సీత’ చిత్రం నుంచి కళ్యాణ్ కుమార్ కాస్త పవన్ కళ్యాణ్ అయ్యాడు. ఆ తర్వాత సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌లో వచ్చిన ‘సుస్వాగతం’ సినిమాలో తొలిసారిగా పవన్ కళ్యాన్ పేరుకు ముందు పవర్ స్టార్ బిరుదుతో టైటిల్ కార్డ్ వేసారు. మొత్తానికి పవన్ కల్యాణ్.. పవర్ స్టార్ పేరు పెట్టడం వెనక పోసాని కృష్ణమురళి ఉన్నారన్నమాట. ఇదే విషయాన్ని గతంలో చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్‌తో పాటు పోసాని కూడా తెలియజేసారు. మొత్తానికి అప్పటినుండి ఇప్పటి వరకూ పవర్ స్టార్ అనే బిరుదుతో నిజంగానే పవన్ కళ్యాణ్.. తెలుగు ఇండస్ట్రీలో పవర్ స్టార్‌గా తన సత్తా చూపిస్తూనే ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.!

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago