Featured

ఒకప్పుడు విలన్ గా కనిపించిన కన్నడ ప్రభాకర్ అంతుచిక్కని వ్యాధితో ఎలా మరణించాడో తెలిస్తే కన్నీళ్లు ఆగవు..?!

గంభీరమైన రూపం అదే స్థాయిలో ఆయన వాచకం.ఆయన తెలుగు చిత్రాల్లో ధరించినవన్ని ప్రతి కథా నాయకుని పాత్రలే.. అయనా ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. 1948 లో మైసూర్ రాష్ట్రంలో (కర్ణాటక) జన్మించారు. సినిమాల్లో నటించాలని అభిమానంతో మొదటగా స్టంట్,యాక్షన్ చిత్రాల్లో ఫైట్ చేస్తూ ఉండేవాడు. కన్నడంలో కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినప్పటికి తర్వాత విలన్ పాత్రలో సెటిల్ అయ్యాడు. కన్నడంలో నిజమైన పులితో ఫైట్ చేయడం వలన అక్కడి ప్రేక్షకులు ఇతనిని టైగర్ ప్రభాకర్ అని ముద్దుగా పిలుచుకుంటారు.

తెలుగులో లో ‘మంత్రి గారి వియ్యంకుడు’ సినిమాలో చిరంజీవితో నటించాడు. ఆ తర్వాత రాక్షసుడు, పసివాడి ప్రాణం, కిరాతకుడు, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి తెలుగు చిత్రాల్లో నటించాడు. కన్నడ ప్రభాకర్, చిరంజీవితో నటించిన అన్ని సినిమాలు దాదాపుగా విజయవంతమయ్యాయి. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 450 చిత్రాల్లో కన్నడ ప్రభాకర్ నటించారు.

ఆయన మొదటగా అల్ఫోంజ మేరీని వివాహం చేసుకున్నాడు. వీరికి భారతి, గీత, మరో కొడుకు వినోద్ ప్రభాకర్ కూడా ఉన్నారు. ఆ తర్వాత కన్నడ ప్రముఖ నటి జయమాలను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ సౌందర్య కు జన్మనిచ్చారు. ఆ తర్వాత వైవాహిక విభేదాల వలన విడిపోయి కన్నడ ప్రభాకర్ తిరిగి మరో నటి అంజుని వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ అర్జున్ జన్మనిచ్చారు.

సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడే ఒకసారి కన్నడ ప్రభాకర్ కి బైక్ యాక్సిడెంట్ జరిగింది. కన్నడనాట రాజకీయ రంగంలో రాణించాలని భావించిన కన్నడ ప్రభాకర్ కు అనివార్య కారణాల వలన రాజకీయాల్లోకి వెల్లడం కుదరలేదు. కానీ ఆయన రెండో భార్య జయమాల కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ తర్వాత ఎమ్మెల్యే మరియు మంత్రి పదవులను సైతం పొందారు.

కర్ణాటకలో కన్నడ ప్రభాకర్ ఎంతోమంది పేద వాళ్లకి ఆర్థిక సహాయాన్ని అందజేసేవారు. ఇలా చారిటీస్ చేయడం వలన అక్కడి ప్రజలు ఆయనను దేవుడు లాగా కొలుస్తారు. కానీ విధి వక్రీకరించడం వలన ఒకప్పటి బైక్ యాక్సిడెంట్ గాయాల వలన ఆయనకు “మల్టిపుల్ ఆర్గాన్ డిస్ఫంక్షన్” అనే వ్యాధి చుట్టుముట్టింది.

అప్పుడు కన్నడ ప్రభాకర్ ను బెంగళూరులోని మాల్యా హాస్పిటల్లో చేర్పించారు. వ్యాధి శరీరం మొత్తం సోకకుండా ఉండాలి అంటే ఆయన రెండు కాళ్ళు తీసేయాలని వైద్యులు చెప్పారు. కాళ్లు లేకుండా తనను తాను ఊహించుకోవడం కన్నడ ప్రభాకర్ వలన కాలేదు. తన కాళ్లు తీసి వేయకూడదు అని వైద్యులతో ఆయన చెప్పారు. ఆ క్రమంలో వైద్యులు సాయశక్తుల కష్టపడి కొంతమేరకు వైద్యం చేసి అతనిని ఇంటికి పంపించడం జరిగింది. అలా పంపించిన కొద్దిరోజులకే వ్యాధి తీవ్రరూపం దాల్చడంతో.. కన్నడ ప్రభాకర్ తిరిగిరాని లోకాలకు 2001లో వెళ్లిపోయారు. ఆయన లేని లోటును దక్షిణాది సినీ పరిశ్రమలో మరో నటుడు పూడ్చలేనిది.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago