Pitapuram: పవన్ ను ఓడించే అందుకు కోట్లు ఖర్చు చేస్తున్న వైసీపీ… పవన్ గెలుపును ఒప్పుకున్నట్టేగా?

Pitapuram: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో అందరి చూపు పిఠాపురం వైపే ఉంది పిఠాపురం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి వంగా గీత పోటీ చేస్తున్నారు. అలాగే పొత్తులో భాగంగా జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అందరి చూపు పిఠాపురం పైనే ఉంది.

పిఠాపురంలో గ్రౌండ్ లెవెల్ లో చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కు మెజారిటీ ఉందని స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆయనకు పోటీగా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వంగ గీతాను జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఎలాగైనా ఈ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు కూడా రచిస్తున్నారు.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా ఆ నియోజకవర్గంలో మండలాల వారిగా ఇన్చార్జిలను కేటాయిస్తూ పార్టీ విజయానికి దోహదపడేలా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఒక ఓటుకు పదివేలు చొప్పున డబ్బు కూడా పంచుతున్నారని ఇంటికి లక్ష రూపాయలు చొప్పున డబ్బును అందిస్తున్నట్టు సమాచారం.

ఓటుకు నోట్లు…
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నటువంటి తరుణంలో ఓటమి లక్ష్యంగా వైసిపి ముందడుగులు వేస్తున్నారు. ఇలా భారీ స్థాయిలో డబ్బును పంచుతున్నారని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ నియోజకవర్గంపై ఆసక్తి నెలకొంది. ఇక వైసిపి ఈ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అంటే పవన్ కళ్యాణ్ గెలుపును వీరు ఒప్పుకున్నట్లేనని ఆయనకు భయపడే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని తెలుస్తోంది.