Prabhas: టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి సినిమా తర్వాత ఈయన పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. అప్పటినుంచి ప్రభాస్ వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయం పక్కన పెట్టే ప్రభాస్ వ్యక్తిగత విషయానికి వస్తే ఈయన మంచి భోజనం ప్రియుడు అనే సంగతి మనకు తెలిసిందే.
ప్రభాస్ ఇంటికి ఎవరైనా వెళ్తే ఎన్నో రకాల ఆహార పదార్థాలతో వారికి ఆతిథ్యం ఇస్తారనే విషయాన్ని ఎంతోమంది తెలియచేశారు. ఇక ఈయన సినిమాలో షూటింగ్ ఉన్నా కూడా షూటింగ్ లోకేషన్ లో ఎవరికి ఏమి ఇష్టం అనే విషయాన్ని తెలుసుకొని మరి ఫుడ్ తీసుకువస్తూ ఉంటారట. తాను ఎంతో ఇష్టంగా ఫుడ్ తింటారు అంతే ఇష్టంగా ఇతరులకు కూడా పెడతారని తెలుస్తోంది.
ఈ విధంగా ప్రభాస్ ఇచ్చిన ఆతిథ్యం గురించి ఇప్పటివరకు ఎంతోమంది సెలబ్రిటీలో ఎంతో గొప్పగా చెప్పారు. ప్రభాస్ ఫుడ్ పెట్టి చంపేసే రకం అంటూ ఈయన ఇచ్చే ఆతిథ్యం గురించి పలు సందర్భాలలో వెల్లడించారు. ఇలా భోజనాన్ని ఎంతో ఇష్టంగా తినే ప్రభాస్ కి రొయ్యల బిర్యానీ అంటే చాలా ఇష్టమట. రొయ్యల బిర్యానీ కనుక తన ముందు ఉంటే ఆయన డైట్ లో ఉన్నాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి తింటారట.
కాకరకాయ ఇష్టం లేదా..
ఇలా ప్రభాస్ కి రొయ్యల బిర్యానీ అంటే ఎంతో ఇష్టం అయితే ఈయనకు నచ్చని ఆహార పదార్థాలు కూడా కొన్ని ఉన్నాయట. తనకు కాకరకాయ అంటే ఏమాత్రం నచ్చదని చిన్నప్పటినుంచి కూడా కాకరకాయ చూస్తే చాలా చిరాకు వస్తుందని ప్రభాస్ తెలిపారు. కొన్నిసార్లు కాకరకాయ కనుక టేబుల్ పైన ఉంటే కోపంతో ఫుడ్ తినడం కూడా మానేస్తూ ఉంటారట. తనకు కాకరకాయ అంటే చిన్నప్పటి నుంచి కూడా ఏమాత్రం ఇష్టం ఉండదని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…