Featured

ఎన్టీఆర్ రాజీవ్ కనకాల మధ్య స్నేహం ! అందరి ముందు ఆలా అనేసరికి రాజీవ్ హార్ట్ అయ్యాడు..

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ చాలామంది వారసులు ఎంట్రీ ఇస్తూ హీరోలు గా సినిమాలు చేస్తూ అగ్ర హీరోగా వెలుగొందుతున్న విషయం కూడా మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా వారసుల కొడుకుల కి మొదటి నుంచే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండడం వలన వాళ్ళ ఎంట్రీ సులభం అవుతుంది. అయితే ఒకప్పుడు విశ్వవిఖ్యాత నటసార్వ భౌముడు గా గుర్తింపు పొందిన ఎన్టీఆర్ ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ బాలకృష్ణ , జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఇక్కడ హీరోలుగా స్టార్ లు గా గుర్తింపు తెచ్చుకున్నారని మన అందరికి తెలిసిందే.

అయితే ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా సమయంలో నటుడు రాజీవ్ కనకాలతో చాలా క్లోజ్ గా ఉంటూ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ గా మారారు అనే విషయం కూడా తెలిసిందే. ఎందుకంటే ఎన్టీఆర్ చేసే చాలా సినిమాల్లో రాజీవ్ కనకాల కూడా ఒక క్యారెక్టర్ చేస్తూ ఉంటాడు. ప్రస్తుతం కూడా వాళ్ళ ఫ్రెండ్ షిప్ అలాగే కొనసాగుతూ ఉంది. అయితే ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూలో రాజీవ్ కనకాల ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ వాళ్ళ ఫ్రెండ్ షిప్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. అవేంటో ఒకసారి మనం తెలుసుకుందాం…

రాజీవ్ కనకాల మొదటగా సీరియల్ లో నటించి నటుడిగా మంచి గుర్తింపు సాధించుకున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన శాంతినివాసం సీరియల్ లో నటించి నటుడిగా తనదైన నటనను ప్రదర్శించాడు. అయితే రాజమౌళి దర్శకుడిగా మారి సినిమా చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు తను రాసుకున్న కథలో రాజీవ్ కనకాలకి కూడా ఒక క్యారెక్టర్ ని ఇచ్చాడు. అందులో భాగంగా రాజువ్ మొదటి రోజు షూటింగ్ కి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ సెట్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ రాజీవ్ కనకాల ని కామెడీగా ఏదో ఒకటి అంటూ ఉండేవాడు. అయితే రాజీవ్ కనకాల మాత్రం తను అందరి ముందు అలా అనడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉండే వాడు. అలా ఎన్టీఆర్ కి రాజీవ్ కి మొదటి పరిచయంలోనే ఎన్టీఆర్ రాజీవ్ ని ఏదో ఒక విషయం లో కామెంట్ చేయడంతో రాజీవ్ కి అది నచ్చలేదు.

దాంతో రాజీవ్ ఆ సినిమా దర్శకుడు అయిన రాజమౌళికి ఫోన్ చేసి ఎన్టిఆర్ తనని ఇలా అంటున్నాడు. ఎంతైనా వాళ్లది పెద్ద ఫ్యామిలీ కదా ఏదైనా అంటే దానికి నేను ఏదైనా రివర్స్ లో అంటే నా కెరీర్ కి ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఈ సినిమా నుంచి తప్పుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పడంతో రాజమౌళి అలాంటిది ఏమీ ఉండదు. నువ్వు రా ఏదో కామెడీగా ఉన్నాడు అని చెప్పి రాజీవ్ కనకాలని మళ్లీ తీసుకొచ్చాడు. ఆ తర్వాత రోజు ఎన్టీఆర్ రాజీవ్ కనకాలని చూస్తూ కూర్చోండి సార్ అని మాట్లాడుతూ ఉండేవాడు.

ఇలా రోజుకు ఒక రకంగా చేస్తూ రాజీవ్ ని ఏడిపిస్తూ ఉండేవాడు. ఎన్టీఆర్, రాజీవ్ వాళ్ళిద్దరు సినిమా షూటింగ్ సమయంలోనే నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా మారారు. అయితే ఒకానొక రోజు అంబేద్కర్ కాలేజీలో ఒక సీన్ చిత్రీకరిస్తున్నప్పుడు అక్కడెక్కడో పైన ఉన్న ఎన్టీఆర్ కింద ఉన్న రాజీవ్ అరే రాజీవ్ పైకి రా రా అని పిలిచాడు. దాంతో రాజీవ్ అదేంటి అలా అంటున్నావ్ అంటే ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం అనుకుంటారు లేరా అని అన్నాడు అని రాజీవ్ నవ్వుతూ చెప్పాడు. అప్పటి నుంచి వీరిద్దరి ఫ్రెండ్షిప్ చాలా అద్భుతంగా కొనసాగుతుందని చెప్పాడు…

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

మలేరియా, డెంగ్యూ ఒకేలా అనుకుంటున్నారా..? నిజం ఇది తెలుసుకోండి!

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25ను ప్రపంచ మలేరియా దినోత్సవంగా పాటిస్తారు. దోమల ద్వారా వ్యాపించే ఈ ప్రాణాంతక వ్యాధిపై ప్రజల్లో అవగాహన…

29 minutes ago

శనివారం పిండి దీపం పూజ ఎందుకు ప్రత్యేకం..? పిండి దీపం పూజ రహస్యం ఏమిటి..?

శనివారం రోజు హిందూ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన ప్రాముఖ్యత కలిగి ఉంది. ముఖ్యంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించేందుకు ఈ రోజు…

50 minutes ago

టీ, కాఫీకి గుడ్‌బై చెప్పండి.. ఉదయం మజ్జిగతో అద్భుత లాభాలు!

ఉదయం లేవగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది టీ లేదా కాఫీ. బెడ్ టీ లేకుండా రోజు మొదలవదనే అలవాటు చాలా…

1 hour ago

స్పృహ కోల్పోతే నీరు తాగిస్తున్నారా..? ఇది ప్రాణాంతక తప్పు కావచ్చు!

అకస్మాత్తుగా ఎవరో స్పృహ కోల్పోతే చాలామంది వెంటనే చేసే పని వారి ముఖంపై నీళ్లు చల్లడం లేదా నీరు తాగించడానికి…

1 hour ago

కాల్షియం లోపానికి ఉప్పు కారణమా..? శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

ఉప్పు లేకుండా ఆహారం పూర్తవదు. ప్రతి ఇంట్లో రోజూ వాడే ముఖ్య పదార్థాల్లో ఉప్పు ఒకటి. కానీ దీని వినియోగం…

1 hour ago

టెన్షన్ ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుందా..? జీవనశైలిలో దాగి ఉన్న అసలు కారణాలు

ఈ రోజుల్లో అధిక రక్తపోటు (హై బీపీ) సమస్య చాలా సాధారణంగా మారుతోంది. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో కూడా…

2 hours ago