Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?

Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?

Politics: పశ్చిమ బెంగాల్లో అధికార త్రుణమూల్ కాంగ్రెస్ పార్టీకి.. బీజేపీ పార్టీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు పార్టీల కార్యకర్తల మధ్య నిత్యం ఘర్షణలు చెలరేగుతున్నాయి.  చాలా చోట్ల హత్యలు, మానభంగాలకు కూడా దారితీశాయి. గతేడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత భారీగా ఘర్షణలు చెలరేగాయి. 

Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?
Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?

ఇదిలా ఉంటే ఏం లేని స్థానం నుంచి ప్రధాన ప్రతిపక్షంగా ఎదిగింది బీజేపీ. దీనికి కారణం సువేందు అధికారి. త్రుణమూల్ కాంగ్రెస్ క్యాబినెట్ మంత్రిగా ఉన్న ఆయన 2021లో ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. ఏకంగా బెంగాల్ ముఖ్యమంత్రి మమత పైనే గెలిచారు. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీని ఓడించి సత్తా చాటారు.

Politics: పశ్చిమబెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..! తిరిగి సొంత గూటికి సువేందు అధికారి..?

అయితే ప్రస్తుతం సువేందు అధికారి  మళ్లీ సొంతగూటికి వెళ్లేందుకు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మాట అన్నది ఎవరో కాదు త్రుణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కునాల్ ఘోష్. బిజెపిలో సువేందు అధికారి ఇమడలేకపోతున్నారని మాకు తెలిసింది.

బీజేపీ అధిష్టానం పెడచెవిన పెడుతుందనే..

కాంటేయ్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అభ్యర్థుల జాబితాపై ఆయన అసంతృప్తిగా ఉన్నారట. ఈ జాబితాలో సువేందు అధికారి సోదరుడు సౌమేందు అధికారి పేరు సూచించినా.. బీజేపీ అధిష్టానం పట్టించుకోవడం లేదట. గతంలో సౌమేందు అధికారి కాంటేయ్ మున్సిపాలిటీ ఛైర్మన్ గా పనిచేశారు.  కాంటేయ్, కాంతి ప్రాంతాలు సువేందు కుటుంబానికి కంచుకోటలా ఉండేవి. అయితే అలాంటిది తన మాటను కూడా బీజేపీ అధిష్టానం పెడచెవిన పెడుతుందనే సువేందు అధికారి కోపంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీపై సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. అందువల్ల టీఎంసీలోకి మళ్లీ తీసుకునే అవకాశం కూడా లేదని కునాల్ ఘోష్ అన్నారు.