Actor Kantharao Daughter Susila : కాంతారావు మొదటి భార్య పిల్లలు ఎలా చనిపోయారు?? రెండవ భార్య పిల్లలు ఎక్కడున్నారు, ఏంచేస్తున్నారు?? ఆస్తులు ఎలా పోగొట్టుకున్నాడు..??

Actor Kantharao Daughter Susila : జానపద సినిమాలో కత్తి యుద్ధాలు చేసే హీరో అనగానే గుర్తొచ్చే హీరో కాంతారావు. ఆయన పూర్తి పేరు తాడేపల్లి లక్ష్మీకాంతరావు. అయన నాటకాలల్లో ప్రసిద్ధి చెంది ఆ తరువాత సినిమాల వైపు వచ్చారు. అనేక జానపద, సాంఘిక చిత్రలాల్లో నటించిన ఆయన దాదాపు 100 సినిమాలలో హీరోగా నటించారు. ఇక మిగిలిన సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను అలాగే విలన్ గాను నటించారు. ముఖ్యంగా నారద పాత్రలో బాగా ఫేమస్ కాంతారావు గారు. ఎన్టీఆర్ తో సమానంగా పౌరాణిక జానపదాలలో నటించిన ఆయన అప్పటి సమకాలిన నటులైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ తో సమానమైన క్రేజ్ ను సంపాదించుకున్నారు. ఇక చెన్నై లో స్థిరపడి ఆస్తులను కూడా సంపాదించిన కాంతారావు గారు చివరి రోజుల్లో మాత్రం సొంత ఇల్లు కూడా లేకుండా చనిపోయారు. ఇక ఆయన గురించి కుటుంబ విషయాలను కూతురు సుశీల రావు పంచుకున్నారు.

ఆయన నిర్మాత్తగా మరీ ఆస్తులను అమ్మేశారు…

కాంతారావు గారి మొదటి భార్య పిల్లలు మరణించడం తో రెండో పెళ్లి చెసుకున్నారు. మొదటి భార్య సుశీల గారికి ఒక పాప పుట్టినరోజు కొద్ది రోజులకు మరణించగా కొడుకు ఉండేవాడు. ఇక ఆమె మరణించాక హైమావతి అనే మరొకరిని పెళ్లి చేసుకున్న కాంతారావు గారికి ఆ తరువాత ఐదుగురు సంతానం. ఆయన మొదటి భార్య కొడుకు నిమోనియా వల్ల మరణించడం జరిగింది. ఇక రెండో భార్య పిల్లలలో మొదటి కొడుకు పేరు ఆయన మొదటి సినిమాలో పాత్ర పేరు ప్రతాప్ గా పెట్టారు. ఇక రెండో అబ్బాయి కి కాంతారావు గారి నాన్న గారి పేరు కేశవరావు అని పెట్టారు. ఇక కూతురు సుశీలకు కాంతారావు గారి మొదటి భార్య పేరు పెట్టారు. ఇక తరువాత పుట్టిన కొడుకుకి ఆయన అమ్మ పేరు రాజేశ్వరి ని రాజా గా పెట్టారు.

చివరి అబ్బాయి కి భార్య తండ్రి పేరు సత్యనారాయణ అని పెట్టారు. మొదటి ఇద్దరు మగ పిల్లలు చెన్నై లో ఉండగా, మిగిలిన వారు హైదరాబాద్ లో స్థిరపడ్డారు. ఇక చెన్నై లో నాలుగు వందల ఎకరాల పొలం మూడంతస్థుల ఇల్లు ఉండగా సినిమాలను నిర్మించాలని ప్రొడ్యూసర్ గా మారి ఆస్తులను అమ్ముకోవల్సి వచ్చిందని కూతురు చెప్పారు. ‘సప్తస్వరాలు’ అనే సినిమాతో బాగా నష్టపోయిన ఆయన పొలం అమ్మారు. ఇక నాలుగు వందల ఎకరాల్లో చివరికి యాభై ఎకరాలు మిగలగా చివర్లో వాణిశ్రీ గారితో చేరి ‘స్వాతి చినుకులు’ సినిమా నిర్మించి మొత్తంగా నష్టపోయారు అంటూ చెప్పారు.