Actress Jayaprada: సీనియర్ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసిన కోర్ట్… ఎందుకంటే?

Actress Jayaprada: సీనియర్ నటి బిజెపి నాయకురాలు జయప్రద పై ఉత్తర ప్రదేశ్ రాంపూర్ హైకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే కోర్టు జయప్రద పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు.అయితే కోర్టు ఈమెకు నోటీసులు జారీ చేయడానికి గల కారణం ఈమె ఎన్నికల సమయంలో ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించడమే కారణమని తెలుస్తోంది.

2019 లోక్ సభ ఎన్నికల సమయంలో భాగంగా ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో నిబంధనలను ఉల్లంఘించినట్లు ఈమెపై పలు కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలోనే విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించినప్పటికీ జయప్రద మాత్రం విచారణకు హాజరు కాలేదు. దీంతో కోర్టు ఈమె పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఈ క్రమంలోనే జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది అమర్ నాథ్ తివారి వెల్లడించారు.ఇలా రాంపూర్ కోర్టులో జయప్రదకు నోటీసులు జారీ చేయడమే కాకుండా వచ్చే మంగళవారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇలా ఈమెను మంగళవారం విచారణకు తీసుకురావాల్సిందిగా కోర్టు రాంపూర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ లకు ఆదేశాలు జారీచేసింది.

Actress Jayaprada: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన జయప్రద….


ఇక ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను జనవరి 9వ తేదీకి వాయిదా వేసినట్లు వెల్లడించారు. అయితే 2019 ఎన్నికల సమయంలో ఈమె ప్రచార కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున బహిరంగ సభలను నిర్వహిస్తూ నిబంధనలను ఉల్లంఘించారన్న నేపథ్యంలోనే ఈమె ఈ విధమైనటువంటి కేసులో నమోదు అయ్యాయి.