Samantha:దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఈమె తెలుగు తమిళ భాషలతో పాటు హిందీ భాషలో కూడా నటించి ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు.ఏం మాయ చేసావే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి సమంతా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్రతారగా వెలిగారు.
ఇక ఈమె ఇండస్ట్రీలోకి వచ్చిన అనంతరం ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఇలా సమంత ఇండస్ట్రీలోకి వచ్చి పుష్కరకాలం పూర్తి అయింది.ప్రస్తుతం సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా సమంత ఆస్తుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సమంత ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు 12 సంవత్సరాలు పూర్తి కావడంతో ఈమె ఎంత మొత్తంలో ఆస్తులు సంపాదించింది అనే విషయం గురించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే పలు నివేదికల ఆధారంగా 2022 సమంత నికర ఆదాయపు విలువ సుమారు 97 కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
ఈమెకు హైదరాబాద్లో ఖరీదైన భవనాలతో పాటు కార్లు కూడా ఉన్నాయి.అదేవిధంగా సమంత తన పెట్టుబడిని మొత్తం పలు వ్యాపారాలలో ఇన్వెస్ట్ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా పలు వ్యాపారాలలో పెట్టుబడులు పెడుతూ వ్యాపార రంగంలో కూడా సమంత సక్సెస్ సాధించారు. ఇక ఈమె సోషల్ మీడియా ద్వారా కూడా భారీగానే సంపాదిస్తుంది.ఇక వాణిజ్య ప్రకటనల ద్వారా ఒక్కో ప్రకటనకు మూడు నుంచి నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. మొత్తానికి సమంత ఇండస్ట్రీ లోకి వచ్చి భారీగానే ఆస్తులు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…