Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్లకు హాజరుకారు అయితే ఈమె నిర్మాణంలో ఈమె హీరోయిన్గా నటించిన కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను మాత్రం భారీగా నిర్వహించారు.ఈ క్రమంలోనే కనెక్ట్ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా యాంకర్ సుమతో కలిసి తెలుగులో ఈమె ఒక ఇంటర్వ్యూలో హాజరయ్యారు.
ఈ క్రమంలోనే సుమ తెలుగులో నయనతార నటించిన హీరోల గురించి పలు ప్రశ్నలు అడిగారు. ఇక నయనతార ఎన్టీఆర్ తో కలిసి అదుర్స్ సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే ఆదర్శ సినిమా షూటింగ్ సమయంలో ఎన్టీఆర్ అల్లరి గురించి ఆయన వ్యక్తిత్వం గురించి నయనతార ఈ సందర్భంగా తెలియజేశారు.
ఎన్టీఆర్ చాలా అల్లరోడని ఎప్పుడు ఏదో ఒక సెటైర్స్ వేస్తూ అందరిని నవ్విస్తూ ఉంటారని తెలిపారు. ఇక ఎన్టీఆర్ గొప్ప డాన్సర్ అని ఆయన ఎలాంటి రిహార్సల్స్ లేకుండా అప్పటికప్పుడు స్టెప్స్ చూసి టేక్ కి సిద్ధమవుతారు అంటూ ఆయన డాన్స్ గురించి నయనతార ప్రశంసల వర్షం కురిపించారు. ఎన్టీఆర్ లాంటి గొప్ప డాన్సర్ ను తాను ఇప్పటివరకు చూడలేదని నయనతార తెలియజేశారు.
ఇక అదుర్స్ సినిమా షూటింగ్ సమయంలో మేకప్ రూమ్ లో తాను మేకప్ వేసుకుంటూ ఉండగా ఎన్టీఆర్ వచ్చి అలాగే చూస్తూ ఉన్నారు. ఏంటి అని ప్రశ్నించడంతో ఎందుకు అలా మేకప్ అవుతున్నావు అని ప్రశ్నించారు. షార్ట్ ఉంది కదా అనడంతో ఎందుకు స్క్రీన్ పై నేను పక్కన ఉంటే నువ్వు కనపడవు కదా.. అందరూ నన్నే చూస్తారు కదా అంటూ సెటైర్లు వేసారని అప్పటి విషయాలను నయనతార ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.ప్రస్తుతం ఎన్టీఆర్ గురించి నయనతార చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…