Un Stoppable 2: బాలకృష్ణ వ్యాఖ్యాతగా అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇప్పటికే ఈ కార్యక్రమం మొదటి సీజన్ మంచి విజయం అందుకోవడంతో రెండవ సీజన్ కూడా అంతకుమించి అనేలా ఆదరణ సంపాదించుకుంటుంది. ఇకపోతే ఈ కార్యక్రమంలో సీనియర్ నటీమణులు అయినటువంటి జయసుధ, జయప్రదలతో కలిసి యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా కూడా హాజరయ్యారు.
తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో బాలయ్య ఈ ముగ్గురు హీరోయిన్లతో కలిసి ఓ రేంజ్ లో రచ్చ చేశారని తెలుస్తోంది.ఇక ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేడు మధ్యాహ్నం ప్రసారం కానుంది.ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ హీరోయిన్లతో కలిసి డాన్స్ లు వేయడమే కాకుండా ఇండస్ట్రీ గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.
ఇక ఈ ప్రోమోలో నటి రాశి కన్నా ఊహలు గుసగుసలాడే సినిమా నుంచి ఏ సందేహం లేదు అనే పాట ఆలపించి అందరిని సందడి చేశారు. ఇక రాశి ఖన్నా నవ్వుకు తాను పడిపోయాను అంటూ బాలయ్య మాట్లాడారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన నటి శృతిహాసన్ గురించి మాట్లాడుతూ నేను శృతిహాసన్ హాట్ ఫెయిర్ ఆఫ్ ఏపీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బాలయ్య ఇలా మాట్లాడటంతో జయసుధ జయప్రద ముఖ కవళికలు కూడా మారిపోయాయి. ఇక శృతిహాసన్ బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీర సింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా బాలకృష్ణ ఈ హీరోయిన్లను కొన్ని ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టారు. మొత్తానికి ఈ ముగ్గురు భామలతో కలిసి బాలయ్య రచ్చ ఓ రేంజ్ లో ఉంటుందని మాత్రం ప్రోమో చూస్తేనే అర్థమవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…