Actress Rupa Lakshmi : రెమ్యూనరేషన్ ఇవ్వలేదని చాలా రూడ్ గా మాట్లాడా… విజయశాంతి గారితో నటించినపుడు ఎలా ఉండేదంటే…: నటి రూప లక్ష్మి

Actress Rupa Lakshmi : తెలుగు సినిమాలలో హీరో హీరోయిన్ల తల్లి పాత్రలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రూప లక్ష్మి. శ్రీ విష్ణు హీరోగా వచ్చిన ‘నీది నాది ఒకటే కథ’ సినిమాలో హీరో శ్రీ విష్ణు తల్లి పాత్రలో నటించడమే కాకుండా కామెడీ పంచులతో ఆకట్టుకుంది. ఇప్పటి వరక దాదాపుగా 50 సినిమాలలో చిన్న చిన్న పాత్రలలో నటించింది. నాగ శౌర్య హీరోగా వచ్చిన నర్తనశాల, ఏక్ మినీ కథ, క్రాక్, సరిలేరు నీకెవ్వరు, మిడిల్ క్లాస్ అబ్బాయి మొదలైన సినిమాలలో నటించింది వి.ఎస్ రూప లక్ష్మి. తాజాగా బలగం సినిమాతో మంచి గుర్తింపు అందుకుంది

రెమ్యూనరేషన్ కోసం గొడవ పడ్డాను…

రూప లక్ష్మి గారు సినిమా అవకాశాల కోసం మొదట్లో ఇబ్బందులు పడినా హీరోలకు తల్లిగా అవకాశాలు రావడంతో చేశారు. అయితే అవకాశం అయితే వచ్చినా కానీ రెమ్యూనరేషన్ టైంకి ఇచ్చేవారు కాదట. అలా ఒక సినిమా షూటింగ్ సమయంలో రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకపోవడంతో వాళ్ళు గట్టిగా మాట్లాడటం తాను కోపంలో గొడవ పడటం చేశారట. ఆరోజు మళ్ళీ ఆలోచిస్తే డబ్బు అడగాల్సిన పద్ధతి అది కాదనిపించింది. ఇంకో నాలుగు రోజులు ఆలస్యం అయ్యుండేదేమో కొంచం నిదానంగా మాట్లాడాల్సింది అనిపించిందట.

అప్పటి నుండి ఎవరైనా రెమ్యూనరేషన్ సరిగా ఇవ్వకపోతే ముందే షూటింగ్ కి ఇస్తే వస్తాను అని చెప్పడం అలవాటు చేసుకున్నానని గొడవ పడకూడదని డిసైడ్ అయ్యానంటూ చెప్పారు. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమాలో విజయశాంతి, మహేష్ బాబు ఇద్దరి సరసనా నటించడం మంచి ఎక్స్పీరియన్స్ అంటూ చెప్పారు. విజయశాంతి గారిని సినిమాల్లో చూస్తూ పెరిగిన నేను ఈ రోజు ఆవిడతో నటించడం అంటే ఆ అనుభూతి మాటలకు అందదు. ఆమె చాలా సింపుల్ గా ఉంటారు చాలా బాగా అందరితో కలిసి పోయి మాట్లాడుతుంటారు. అది చూసినపుడు ఇంకా గౌరవం పెరిగింది అంటూ రూప లక్ష్మి చెప్పారు.