Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి దిల్ రాజు ఇప్పటివరకు తన నిర్మాణ సంస్థలో 50 సినిమాలను నిర్మించారు.ఇలా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈయన ప్రస్తుతం భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలను నిర్మిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈయన వ్యక్తిగత విషయానికి వస్తే దిల్ రాజు మొదటి భార్య అనిత మరణించిన సంగతి మనకు తెలిసిందే.
ఈ దంపతులకు కుమార్తె హన్షిత రెడ్డి ప్రస్తుతం నిర్మాతగా ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. తనకు ఇద్దరు సంతానం కూడా కలరు.అయితే తన భార్య అనిత మరణించడంతో తన కుమార్తె స్వయంగా తన తండ్రికి రెండో వివాహం చేశారు. వైగా రెడ్డి అనే అమ్మాయితో దిల్ రాజుకు రెండో వివాహం జరిపించారు. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా జన్మించారు. తన కుమారుడికి ఇద్దరు భార్యల పేర్లు కలిసి వచ్చేలా అన్వయ్ రెడ్డి అనే నామకరణం చేశారు.
ఇక ఈ బాబుకి ఏడాది పూర్తి కావడంతో దిల్ రాజు తన కొడుకు పుట్టినరోజు వేడుకలను ఎంతో అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ పుట్టిన రోజు వేడుకల కోసం సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి ఘనంగా పార్టీ ఇచ్చారు.అయితే బర్తడే కన్నా ముందుగా దిల్ రాజు తన కుమారుడి కోసం ప్రత్యేకంగా ఫోటోషూట్ చేయించారు. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు.
ఈ వీడియోలో దిల్ రాజు కుటుంబ సభ్యులందరూ కలిసి చాలా సంతోషంగా ఆటపాటలతో తమ కొడుకుతో కలిసి ఆడుకున్నారు. ఇక తన కొడుకు కోసం దిల్ రాజు ఏకంగా చిన్నపిల్లాడిలా మారిపోయి తనని ఆడిస్తున్నారు. ప్రత్యేకంగా ఈ సాంగ్ కి థమన్ సంగీతం అందించగా కార్తీక్ పాడాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…