Manchu Lakshmi : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచు లక్ష్మి తనకంటూ ప్రత్యేకమైన స్థాన్నాన్ని సంపాదించుకున్నారు. మంచు మోహన్ బాబు వారసత్వంతో ‘అనగనగా ధీరుడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ప్రశంసలు అందుకుంది. వెండి తెర మీదనే కాకుండా బుల్లితెర మీద కూడా పలు కార్యక్రమాలకు హోస్ట్ గా చేశారు. ఇక ప్రస్తుతం సినిమాలలో నటించడమే కాకుండా నిర్మాతగా వ్యవహారిస్తున్నారు. అంతే కాకుండా లక్ష్మి మంచుకు ఒక యుట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దీంట్లో హోమ్ టూర్లు, వాళ్ళ ఇంట్లోని సెలెబ్రేషన్లు, దానికి సంబంధించిన వీడియోలు పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత అభిరుచులను పంచుకున్నారు.
పిల్లలంటే చాలా ఇష్టం…
మంచు లక్ష్మి తన జీవితంలో మంచి అనుభూతి తన కూతురితో ఉండటమే అంటూ చెబుతారు. అమ్మ అయ్యాకే నేను ఎందుకు పుట్టానో ఆ పర్పస్ తెలిసింది అంటూ ఆనందపడుతారు. అయితే పిల్లలంటే అంత ఇష్టం ఉన్న లక్ష్మి ఎందుకు ఒక్క పాపని మాత్రమే కన్నారు అనే ప్రశ్నకు ముగ్గురు, నలుగురు పిల్లల్ని కనాలని చాలా ఆశ ఉండేది కానీ దేవుడు నాకు ఆ అదృష్టం ఇవ్వలేదు ఒక్కరితో సరిపెట్టాడు అంటూ చెప్పారు.
అయితే తన ఇంట్లో పాపతో పాటు రోజు ఐదారు మంది పిల్లలు ఉంటారు. వాళ్ళ ఆటలు అల్లరి కంటే వాళ్ళ తల్లిదండ్రులు లక్ష్మి దగ్గర ఉంటే పిల్లలు సేఫ్ గా ఆనందంగా ఉంటారు అనుకుని వదిలి వెళ్లడం బాగా ఆనందాన్ని ఇస్తుంది అంటూ లక్ష్మి తెలిపారు. ప్రస్తుతం ఒక స్కూల్ ని దత్తత తీసుకుని పిల్లల చదువులకోసం డబ్బు ఖర్చు పెడుతున్నారు మంచు లక్ష్మి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…