Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది కానీ తెలుగులో మంచి అవకాశాలు మాత్రం అందుకోలేదు. బాహుబలిలో శివగామి వంటి మంచి పాత్ర వస్తే ప్రభాస్ కి తల్లిగా నేను చేయను అంటూ డ్రాప్ అయిందట. ఇక ఆ తరువాత అక్కకి తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. తాజాగా తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించింది. మనోజ్ రెండో పెళ్లి తరువాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.
తెలిసిన వాళ్ళే మోసం చేసారు…
మంచు లక్ష్మి తన జీవితంలో బాగా డిప్రెషన్ లోకి వెళ్లి ఎందుకు జన్మ అనేంతలా ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనే ప్రశ్న ఇంటర్వ్యూలో ఎదురుకాగా చాలా ఉన్నాయంటూ ఆశ్చర్యకర సమాధానం ఇచ్చింది. బయటి వ్యక్తుల మీద నమ్మకం లేకపోతే దూరం పెడతాము. అదే తెలిసిన వాళ్ళే మోసం చేస్తే అది భరించలేము. నేను అలానే మోసపోయాను.
కానీ వాళ్ళ పేర్లు బయటపెట్టి వాళ్లకు పబ్లిసిటీ ఇవ్వాలని అనుకోవడం లేదు. బిజినెస్ చేయాలని అనుకున్నపుడు వాళ్ళను ఎక్కువ నమ్ముతున్నావ్ అని నాన్న చెప్పినా కూడా వినకుండా నమ్మాను. నన్ను దారుణంగా మోసం చేసారు. ఆ బాధ నుండి బయటికి రావడానికి టైం పట్టింది. నిజానికి పాప వల్ల నేను మళ్ళీ నార్మల్ అయ్యాను లేకపోతే కష్టమయ్యేది అంటూ తన జీవితంలోని చేదు అనుభవాలను చెప్పారు లక్ష్మి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…