Alia Bhatt : నచ్చితే సినిమా చూడండి లేదంటే లేదు… ఈ బాయ్ కాట్ ఇవన్నీ ఎందుకు : ఆలియా భట్

Alia Bhatt : నోరు జారితే వెనక్కి తీసుకోలేమని పెద్దల మాట. సెలబ్రిటీలు, రాజకియనాయకుల విషయంలో ఇది సాధారణంగా చూస్తుంటాము. ఏదో ఒక ఇష్యూ జరిగినప్పుడు ఏదో మాట్లాడేసి వివాదాల్లో ఇరుక్కుంటూ ఉంటారు. ఇది సినిమా వాళ్లకైతే మరీ ఎక్కువగా జరుగుతుంటుంది. బయట జరుగుతున్న ఏదో ఒక రన్నింగ్ ఇష్యూ మీద మీడియా వాళ్ళు ప్రశ్నించడం, దానికి వీళ్ళు ఏదో మాట్లాడేసి వివాదాల్లో ఇరుక్కోవడం, జరగాల్సిన నష్టం జరిగిపోయాక క్షమాపణలు చెప్పినా ఏమీ లాభం ఉండదు. ప్రస్తుతం బాలీవుడ్ సెలబ్రిటీలకు ఇదే జరుగుతోంది.

నచ్చక పోతే చూడకండి…

బాలీవుడ్ లో తీవ్రంగా జరుగుతున్న ఇష్యూ బాయ్ కాట్ బాలీవుడ్. అక్కడ నటులు తీస్తున్న చాలా సినిమాలను జనాలు చూడడానికి ఇష్టపడటం లేదు. కొన్ని సినిమాలకు ఆ సినిమా నటుల నోటి దూల కారణమైతే మరికొన్నింటికి సినిమా నచ్చకపోవడంతో బాయ్ కాట్ చేస్తున్నారు. ఇటీవల విడుదల అయిన అమీర్ ఖాన్ కరీనా కపూర్ సినిమా ‘లాల్ సింగ్ చద్దా’ డిజాస్టర్ గా నిలవడానికి కారణం హీరో హీరోయిన్ల నోటి దూలనే. అమీర్ ఖాన్ దేశాన్ని కించపరిచాడు అనే కారణంతో ఆయన సినిమాలు చూడరాదని బాయ్ కాట్ చేసారు. ఇక హీరోయిన్ కరీనా కపూర్ దీన్ని గురించి స్పందిస్తూ చూడకపోతే పోండి అన్న అర్థం వచ్చేలా మాట్లాడటంతో పరిస్థితి మరింత దిగజారింది. బాయ్ కాట్ ఉద్యమం గురించి డైరెక్టర్ అనురాగ్ కష్యప్, తాప్సీ కూడా తక్కువచేసి మాట్లాడి వాళ్ళ సినిమా ‘దోబారా’ కు నష్టం తెచ్చుకున్నారు. ఇక ఇపుడు ఈ లిస్ట్ లోకి ఆలియా భట్ చేరింది. ఆలియా, రన్ భీర్ కలిసి నటించిన ‘బ్రహ్మాస్త్రా’ సినిమా సెప్టెంబర్ 9 న విడుదల కాబోతోంది. ఈ సినిమాను కూడా బాయ్ కాట్ చేయాలంటూ ట్వీట్టర్ లో ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో ఉన్న ఆలియా ఒకింత అసహనం వ్యక్తం చేసింది.

మీకు నచ్చితే చూడండి సినిమా లేకపోతే లేదు అంతే కానీ ఈ బాయ్ కాట్ ఏంటి అంటూ విసుక్కుంది. సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ లో స్టార్ కిడ్స్ గురించి నెగెటివిటీ ఎక్కువైంది. ఇక బ్రహ్మాస్త్రా విషయంలో స్టార్ కిడ్స్ సినిమా కాబట్టి బాయ్ కాట్ చేయాలి అనే వాధన తో బాయ్ కాట్ బ్రహ్మాస్త్రా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ కిడ్స్ అంటూ కామెంట్స్ విని విని విసుగొచ్చింది, నటిగా నన్ను నేను నిరూపించుకున్నా, ఇంకా ఇలా అనడం ఏంటి అంటూ ఆలియా వాఖ్యనించడం, ఇక ఇలా అసహనం వ్యక్తం చేయడంతో ఆలియా ను సోషల్ మీడియాలో బాగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్.