Surekha Vani: సురేఖ వాణి తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఎంతో మంచి గుర్తింపు పొందారు. ఇకపోతే 2019లో సురేఖ వాణి భర్త సురేష్ తేజ గుండెపోటుతో మరణించిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈమె భర్త మరణించిన అనంతరం సురేఖవాణి తన కూతురుతో కలిసి ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నారు.
ఇక ఈ మధ్యకాలంలో ఈ తల్లి కూతుర్లు ఇద్దరు కలిసి సోషల్ మీడియాలో చేసే హంగామా మాములుగా లేదు. నిత్యం ఏదో ఒక రీల్ వీడియో ద్వారా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో సందడి చేస్తూ ఉంటారు. ఇక భర్త మరణం తర్వాత ఈమె రెండో పెళ్లికి సిద్ధమైందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను అప్పట్లో పూర్తిగా ఖండించారు.
ఇదిలా ఉండగా తాజాగా తల్లి కూతుర్లు ఇద్దరు యూట్యూబర్ నికిల్ ఇంటర్వ్యూకి హాజరయ్యారు. సుప్రీత తన తల్లికి రెండో పెళ్లి చేయాలనుకుంటున్నాను అని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇంట్లో ఒంటరిగా ఉంటూ నా తల తినేస్తోంది పెళ్లి చేసేద్దాం అంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఈ విషయంపై స్పందించిన సురేఖ వాణి ప్రస్తుతం నాకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన లేదు.. భవిష్యత్తులో చేసుకుంటానేమో చూడాలి అంటూనే తనకు ఒక మంచి బాయ్ ఫ్రెండ్ మాత్రం కావాలి అంటూ కామెంట్ చేశారు.
ఇక ఈ విషయంపై ఈమె మాట్లాడుతూ తనని బాగా అర్థం చేసుకునే బాయ్ ఫ్రెండ్ కావాలని అలాగే తను మంచి హైట్, లైట్ గా గడ్డం కలిగి ఉండాలి.అలాగే అతని దగ్గర డబ్బులు కూడా బాగా ఉండాలి అలాంటి వ్యక్తి తనకు బాయ్ ఫ్రెండ్ గా రావాలని తనకు నచ్చితే అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని ఈ సందర్భంగా ఈమె చేస్తున్న ఈ కామెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సురేఖ వాణి మాటలు బట్టి చూస్తుంటే ఈమె ఇప్పుడు కాకపోయినా మరి కొద్ది రోజులలో అయినా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…