’రుద్రమదేవి’లో గోనా గన్నారెడ్డి పాత్ర కోసం ముందుగా ఆ స్టార్ హీరోని అనుకున్నారట..?

భారీ చిత్రాల దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రుద్రమదేవి సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.. బయోపిక్ చిత్రంగా వచ్చిన ఈ సినిమా లో రుద్రమదేవి పాత్ర లో అనుష్క నటించింది.. మిగిలిన తారాగణం కూడా పెద్ద పెద్ద నటులే నటించడం విశేషం.. రానా ఈ సినిమా లో కీలక పాత్రలో నటించాడు. ఇక ఈ సినిమాలో వచ్చే అతిముఖ్యమైన పాత్ర గోన గన్నారెడ్డి.. ఈ పాత్ర ను అల్లు అర్జున్ చేసి మెప్పించాడు. ఈ పాత్రకు అయన చెప్పే డైలాగ్స్ కి ప్రేక్షకులనుంచి మంచి స్పందన వచ్చింది.. థియేటర్లో గోలలు, విజిల్స్ పడ్డాయి.

తెలుగు భాష లెక్క నేను ఈడా ఉంటా.. ఆడా ఉంటా అని చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది. పలు భాషల్లోకి అనువాదం అయిన ఈ చిత్రం అక్కడ కూడా మంచి కలెక్షన్లు సాధించి హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవడానికి గోనగన్నారెడ్డి పాత్ర అని చెప్పాలి. అల్లు అర్జున్ చేసినందువల్లనే ఈ పాత్ర బాగా పండింది.. అయితే గుణశేఖర్ ఈ పాత్ర కి ముందుగా అల్లు అర్జున్ ని అనుకోలేదట.. గోనా గన్నారెడ్డి పాత్ర చేయ డానికి మహేష్ బాబుతో పాటు ఎన్టీఆర్ ఎంతో ఆసక్తి చూపించారట. వాళ్లకు ఆ పాత్ర గురించి బాగా తెలుసు. కానీ పరిస్థితులు అనుకూలించలేక వాళ్లు ఈ క్యారెక్టర్ చేయలేకపోయారు. ఆ తర్వాత గోన గన్నారెడ్డి రెడ్డి అల్లు అర్జున్‌ను వరించినట్టు గుణశేఖర్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే గుణశేఖర్ ఈ సినిమా తర్వాత చాల గ్యాప్ తీసుకుని మరొక హిస్టారికల్ సినిమా శాకుంతలం ని చేస్తున్నాడు. ఈ సినిమాలో సమంత తొలిసారి పౌరాణిక పాత్రైన శకుంతలగా నటిస్తోంది. ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్ దుష్యంతుడిగా నటిస్తున్నాడు. కథలో కీలకమైన దుర్వాస మహాముని పాత్రలో మోహన్ బాబును అనుకుంటున్నారు. ఈ సోమవారమే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సినిమా ప్యాన్ ఇండియా లెవల్లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది.