Movie News

జబర్దస్త్ లో రాకేష్ మాస్టర్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో.?

ఎప్పుడైతే యూట్యూబ్ బాగా ఫేమస్ అయ్యిందో అప్పుడు కొంతమంది యూట్యూబ్ స్టార్స్ పుట్టుకొచ్చారు.. ప్రజలు యూట్యూబ్ బాగా వాడుతుండడంతో కొంచెం టాలెంట్ చూపించినా యిట్టె ఫేమస్ అయిపోతున్నారు. అంతేకాదు టాలెంట్ చూపించిన దానికంటే వివాదాస్పద వ్యాఖ్యలు, బోల్డ్ స్టేట్మెంట్స్ చేసిన వారు ఇంకా ఫేమస్ అయిపోతున్నారు. అలాంటి వారిలో ఒకరు రాకేష్ మాస్టర్.. ఈయన యూట్యూబ్ లో పలు ఛానల్స్ వేదిక చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాఖ్యలతో, కామెంట్లతో సెన్సేషనల్‌గా మారాడు రాకేష్ మాస్టర్. సినీ ఇండస్ట్రీ, పెద్దల ముసుగులో ఉన్న బడా స్టార్లను ఏకిపారేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు.

స్టార్ లపై అయన ఇష్టమొచ్చినట్లు కామెంట్స్ చేసి వివాదాస్పద వ్యక్తిగా మారారు. డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఇండస్ట్రీ లో ఉన్న రాకేష్ మాస్టర్ అయన శిష్యుడు శేఖర్ మాస్టర్ పై చేసిన అభియోగాలు అంతా ఇంతా కాదు. ఒకరకంగా శేఖర్ మాస్టర్ ని బన్ధభూతులు తిట్టాడని చెప్పొచ్చు.. ఈయనొకడేనా ఈయన వల్ల నవ్వుల పాలయినవారు చాలామందే ఉన్నారు.. ఈమధ్య అయన ఈ వివాదాస్పద వ్యాఖ్యలు తగ్గించి సొంతంగా ఓ ఛానల్ పెట్టుకుని కామ్ గా ఉంటున్నాడు..

దీంతో పటు అయన జబర్దస్త్ కి రావడ అయన అభిమానులకు ఎంతో ఆనందాన్నిస్తోంది. కొంచెం అటు ఇటుగా ఉన్నా రాకేష్ మాస్టర్ బులెట్ భాస్కర్ టీం లో నటిస్తూ నవ్వులు పండించడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మూవ్ రాకేష్ మాస్టర్ భవిష్యత్ కి మంచిది అంటున్నారు కొందరు. వివాదాస్పద వ్యాఖ్యలతో యూట్యూబ్ లో రచ్చ రచ్చ చేసిన రాకేష్ మాస్టర్ ఇప్పటికైనా నటన మీద దృష్టి పెట్టడం అందరిని ఆనందపరుస్తుంది. మరి ఈయన బుల్లితెరపైనా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago