Allu Arjun: ఓయమ్మ….సినిమాలు మాత్రమే కాకుండా అల్లు అర్జున్ ఇన్ని వ్యాపారాలు చేస్తున్నారా?

Allu Arjun: ప్రస్తుత కాలంలో సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత వెంటనే వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. ఇలా వ్యాపార రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతూ భారీగానే లాభాలు అందుకుంటున్నారు. ఇలా ఇప్పటికీ ఎంతోమంది హీరోలు ఒకవైపు ఇండస్ట్రీలో కొనసాగుతూనే మరోవైపు బిజినెస్ రంగంలో కూడా సక్సెస్ సాధిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్థాయిలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి ఈయన మరోవైపు బిజినెస్ రంగంలో కూడా దూసుకుపోతున్నారు. మరి ఈయన చేస్తున్నటువంటి బిజినెస్ లు ఏంటి అనే విషయానికి వస్తే..

అల్లు అర్జున్ హీరోగా కొనసాగుతూనే హైదరాబాదులో అల్లు స్టూడియో ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక్కడ సినిమాలు, సీరియల్స్ షూటింగ్ చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలోకి అల్లు స్టూడియోస్ ఏర్పాటు చేశారు. అలాగే జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోవైల్డ్ వింగ్స్ బఫే అనే ఒక బార్ అండ్ రెస్టారెంట్ నడుపుతున్నారు. ఇది కూడా మంచి లాభాలలో నడుస్తుంది.

Allu Arjun:కోట్లలో ఆదాయం…


ఇకపోతే ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం మనకు తెలిసిందే. ఆహా ద్వారా ఎన్నో సినిమాలు వెబ్ సిరీస్లో ప్రసారమవుతు పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తోంది.అదేవిధంగా ఏషియన్ వారితో కలిసి అల్లు అర్జున్ మల్టీప్లెక్స్ థియేటర్ ను ఏర్పాటు చేసిన విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈ మల్టీప్లెక్స్ ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే. ఈ మల్టీప్లెక్స్ అన్ని సదుపాయాలతో నిర్మించబడి ఉందని తెలుస్తుంది. ఇలా ఈ వ్యాపారాలు చేస్తూ అల్లు అర్జున్ నెలకు కొన్ని కోట్ల రూపాయల ఆదాయం పొందుతున్నారని.