Movie News

Anasuya: పుష్ప పై పగ తీర్చుకోవడానికి సిద్ధమైన దాక్షాయని… పుష్ప 2 సెట్ లోకి అడుగుపెట్టిన అనసూయ!

Anasuya: బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ప్రస్తుతం బుల్లితెరకు గుడ్ బై చెప్పి ఇండస్ట్రీలో వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నారు.సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్త పాత్రలో నటించి మెప్పించిన అనసూయ అనంతరం వెండితెరపై వెనక్కి తిరిగి చూసుకోలేదు.

ఇలా వెండితెరపై వరుస సినిమాలలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అనసూయ తిరిగి సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో దాక్షాయని పాత్రలో నటించిన విషయం మనకు తెలిసిందే. ఇందులో సునీల్ భార్యగా అనసూయ విభిన్నమైన పాత్రలో నటించారు. ఈమె పాత్రకు మంచి మార్కులే పడ్డాయని చెప్పాలి. మొదటి పార్ట్ లో చాలా వైలెంట్ గా కనిపించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్లో కూడా కీలక పాత్రలో నటిస్తున్నారని తెలుస్తుంది.

ఈ క్రమంలోనే ఈమె పుష్ప 2 లో పుష్పపై పగ తీర్చుకునే పాత్రలో నటించబోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. పుష్ప సినిమాలో అనసూయ తమ్ముడిని పుష్పరాజ్ చంపడంతో తనపై పగ పెంచుకున్నటువంటి దాక్షాయని పాత్రలో అనసూయ కనిపించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి ఈమె అడుగుపెట్టడంతో తనకు మేకప్ వేస్తున్నటువంటి ఫోటోలను అలాగే షూటింగ్ లోకేషన్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను ఈమె షేర్ చేశారు.

Anasuya: పుష్పపై పగ తీర్చుకొనున్న దాక్షాయని…


ఈ విధంగా అనసూయ ఈ ఫోటోలను షేర్ చేయడంతో ఈమె పుష్ప 2 లొకేషన్ లోకి అడుగు పెట్టారని అర్థమవుతుంది.అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు అయినప్పటికీ అనసూయ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను ప్రస్తుతం షూట్ చేయడంతో ఈమె ఈ సెట్ లోకి అడుగు పెట్టారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ద్వారా అనసూయ ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారు,పుష్పరాజ్ పై ఏ విధంగా పగ తీర్చుకోపోతున్నారనే విషయం తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago