Analyst Adusumilli Srinivasa rao : జగన్ ని కాదని మోహన్ బాబు యూటర్న్ తీసుకోవడానికి… చంద్రబాబుకి మళ్ళీ సపోర్ట్ చేయడానికి కారణం అదే..: ఎనలిస్ట్ ఆడుసుమిల్లి శ్రీనివాసరావు

Analyst Adusumilli Srinivasa rao : అధికారంలో ఎవరు ఉంటే వారికి సపోర్ట్ చేస్తూ కొంతమంది నాయకులు సినిమా వాళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సినిమా వాళ్ళు ఎవరు అధికారంలో ఉంటే వారి వద్ద స్నేహంగా ఉంటూనే పనులు జరుపుకుంటారు. అయితే నా రూటే సపరేటు అన్నట్లుగా ఉండే మోహన్ బాబు ఒకప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తూ వచ్చాడు. ఇక జగన్ వైసీపీ పెట్టిన కొత్తలో కూడా బంధువు అయినా టీడీపీ వైపు ఉండిన మోహన్ బాబు సడన్ గా జంప్ అయి జగన్ మా బంధువు అంటూ చంద్రబాబు ను విమర్శిస్తూ జగన్ పంచన చేరాడు. అయితే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబుతో నాకెలాంటి గొడవలు లేవు అంటూ వైసీపీ కి దూరంగా జరుగుతున్నాడు. ఈ ఇష్యూ మీద విశ్లేషకులు ఆడుసుమిల్లి శ్రీనివాసరావు గారు ఆయన అభిప్రాయాలను తెలిపారు.

మోహన్ బాబు ముక్కు సూటి కాదు నోటి దూల మనిషి…

ఒకసారి మోహన్ బాబు, శంకర్ రెడ్డి గొడవ పడి కొట్టుకున్నపుడు చంద్రబాబు వద్దకు పంచాయితీ వెళ్లగా చంద్రబాబు ఏదైనా గొడవ ఉంటే మాట్లాడి సెటిల్ చేసుకోవాలి కానీ ఇలా కొట్టడం ఏమిటి అంటూ శంకర్ రెడ్డికి సపోర్ట్ చేయడంతో మోహన్ బాబు అప్పటి నుండి చంద్రబాబు మీద కోపం పెంచుకున్నాడు. కానీ అవకాశం కోసం. ఎదురుచూసి జగన్ ద్వారా విమర్శలు మొదలు పెట్టాడు. కానీ జగన్ పంచన చేరినా ప్రయోజనం కలుగలేదు. తన విద్యాసంస్థలకు లబ్ది చేకూర్చుకోవాలనే ఆశ నెరవేరకపోవడంతో మళ్ళీ పక్క చూపులు చూస్తున్నాడు.

అందుకే తాజాగా విశాల్ ‘లాఠి’ సినిమా వేడుకలో చంద్రబాబు అంటే నాకు ఎలాంటి విబేధాలు లేవు అంటూ మాట్లాడాడు అంటూ చెప్పారు. అయితే మోహన్ బాబు ఒక చెల్లని నోటు, ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి ఒరిగేది ఏమి లేదు. జగన్ కి మోహన్ బాబు టీడీపీ లోకి వెళ్లినా వచ్చేదేమి లేదు టీడీపీ కి అతను మళ్ళీ పార్టీలోకి వచ్చినా వచ్చే లాభంలేదు. కానీ చంద్రబాబు ను అన్ని మాటలు అన్న మోహన్ బాబును మళ్ళి టీడీపి పార్టీ లోకి పిలుచుకుంటే అంతకంటే అవమానకరమైన పని ఉండదు అంటూ ఆడుసుమిల్లి గారు అభిప్రాయ పడ్డారు.