Analyst Damu Balaji : అరవై సీట్లు ఇస్తేనే టీడీపీ తో పొత్తు… పవన్ కళ్యాణ్ ట్విస్టు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాలలో మూడు ప్రాంతీయ పార్టీల ఎన్నికల హడావిడి మామూలుగా లేదు. ఒకవైపు జగన్ మళ్ళీ నేనే అధికారంలోకి వస్తా అంటుంటే మరోవైపు చంద్రబాబు ఈసారి మీకా ఛాన్స్ ఉండదు మేమే వస్తాం అంటున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కూడా నేనూ సీఎం అభ్యర్థినే నన్ను చట్టసభలకు పంపండి అంటూ మాట్లాడుతున్నానరు. అయితే వైసీపీ ని ఓడించాలంటే ఈసారి ప్రతిపక్షాలన్నీ ఏకమవ్వాలి అలా అయితేనే వ్యతిరేక ఓటు చీలకుండా ఉంటుంది. లేదంటే జగన్ కు ప్లస్ అవుతుంది అనే విశ్లేషణల నడుమ పొత్తు గురించి జనసేనాని ఆసక్తికర కామెంట్స్ చేసారు. వాటి గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

అన్ని సీట్లు ఇస్తేనే పొత్తు లేదంటే లేదు…

జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి బస్సు యాత్ర ద్వారా జనాలతో మమేకం అవుతున్నారు. జనాల నుండి మంచి స్పందన వస్తోంది అంటూ బాలాజీ తెలిపారు. అయితే టీడీపీ తో పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ఆచితూచి అడుగులేస్తున్నారు. సీట్లు ఎక్కువ ఇస్తేనే పొత్తు లేదంటే ఒంటరిగా వెళ్తాను అన్నట్లుగా జనసేనాని భావిస్తున్నట్లు తెలుస్తోందని బాలాజీ తెలిపారు.

అయితే చంద్రబాబు మాత్రం పొత్తు విషయంలో పవన్ కళ్యాణ్ ను తొందరపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, అందుకే ముందస్తుకు జగన్ వెళ్తాడంటూ పదే పదే అంటున్నారని బాలాజీ తెలిపారు. ఒకవేళ పొత్తు పెట్టుకుంటే పవన్ కి అలాగే బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటే వాళ్లకు ఎన్ని సీట్లు ఇవ్వాలి ఏ నియోజకవర్గాలు ఇవ్వాలి అనే విషయాలు ఆల్రెడీ చంద్రబాబు ప్లాన్ చేసిపెట్టారని బాలాజి తెలిపారు. అయితే పవన్ మాత్రం కర్ణాటక లో కుమారుస్వామి లాగా సీట్ల విషయంలో రాజీ పడకుండా అవకాశం వస్తే సీఎం కావాలని అనుకుంటున్నట్లు తెలిపారు.