Featured

Narasimha Raju : ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లను నోటికొచ్చినట్లు మాట్లాడాను… నాకు అవకాశాలు లేకుండా పోడానికి కారణం అదే…: నరసింహ రాజు

Narasimha Raju : తెలుగులో జానపద హీరోగా బాగా గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో నరసింహ రాజు గారు ఒకరు. 1970 లలో అనేక జానపద సినిమాలలో నటించిన ఆయన విఠలాచార్య సినిమా ‘జగన్మోహిని’ ద్వారా సూపర్ హిట్ అందుకున్నారు. అప్పట్లో నరసింహ రాజు, హీరోయిన్ ప్రభ హిట్ పెయిర్ గా నిలిచారు. నరసింహ రాజు గారి తండ్రి దాన ధర్మాలు బాగా చేసి ఆస్తులన్నీ అయిపోగొట్టడం, సినిమాల మీద మక్కువతో నరసింహా రాజు గారు మద్రాస్ వెళ్లి ప్రయత్నం చేయడంతో అవకాశాలు వచ్చాయి. నీడ లేని ఆడది వంటి సినిమాతో కెరీర్ మొదలు పెట్టిన నరసింహ రాజు గారు, విఠలాచర్య గారి పరిచయంతో ఆయన కెరీర్ మారిపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం గ్రామానికి చెందిన నరసింహ రాజు గారు దాదాపు గా 110 సినిమాల్లో నటించారు.

తెలియక వాళ్ళు చేస్తున్న పనిని కామెంట్ చేసాను…

ఆంధ్ర కమల్ హాసన్ గా బిరుదు తెచ్చుకున్న నరసింహ రాజు గారు సినిమాల్లో అవకాశాలు తగ్గాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించారు. పలు సీరియల్స్ లో కూడా నటించారు. ముఖ్యంగా పలు తమిళ సీరియల్స్ లో నటించి పేరు తెచ్చుకున్నారు. 1974లో నీడ లేని ఆడది సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నరసింహ రాజు గారు విఠలాచార్య గారి జానపద సినిమాలలో దాదాపు 12 సినిమాలను చేశారు. ఇక దాసరి నారాయణరావు గారి సినిమాల్లో కూడా ఎక్కువగా నటించిన నరసింహ రాజు గారు దివిసీమ ఘటన సమయంలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అగ్ర హీరోలైనా జోలె పట్టి చందాలు వసూలు చేసి అక్కడి ప్రజలకు సదుపాయాలను కల్పించారు.

అయితే అలా అగ్ర హీరోలు జోలె పట్టే సమయంలో నరసింహ రాజు గారు వీళ్ళు అగ్ర హీరోలు కదా వీళ్లేందుకు చందాలు వసూలు చేస్తున్నారు, వాళ్ళే కొంత డబ్బు విరాళం ఇస్తే అయిపోతుంది కదా, జనాల్లోకి వెళ్లడం ఎందుకు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారట. కానీ అది తప్పు అని మళ్ళీ అర్థమైంది అప్పుడు అల్ప జ్ఞానంతో అవగాహన లేక అలా మాట్లాడను కానీ ఎన్టీఆర్ గారు కానీ ఏఎన్ఆర్ గారు కానీ ఆ సంఘటన తరువాత కలిసినా ఆ కామెంట్స్ మీద స్పందించలేదు, పట్టించుకోలేదు నన్ను ఆప్యాయంగా మాట్లాడించారు అంటూ నేను సక్సెస్ ఫుల్ హీరో అయ్యాక అర్థమైంది జనాల్లోకి వెళ్లి మాట్లాడటం ఎంత కష్టమైన పనో, నేను ఎంత తప్పుగా మాట్లాడానో అంటూ చెప్పారు. ఇక అలాంటి కామెంట్స్ చేసిన తనకు ఆఫర్స్ తగ్గడం అలాంటిదేమీ జరగలేదని చెప్పారు. రానురాను హీరో వేషాలే మనకు ఎపుడూ రావు కదా, అలా అవకాశాలు సన్నగిళ్లడంతో ఇక సీరియల్స్ వైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగాను చేశాను అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago