Rashmika: సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ల గురించి తరచూ అనేక రూమర్లు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి రూమర్ల గురించి కొందరు సెలబ్రిటీలు స్పందిస్తూ వాటిని ఖండిస్తూ ఉంటారు. మరికొందరు మాత్రం ఇలాంటి రూమర్ల గురించి పట్టించుకోకుండా వారి షూటింగ్ పనులతో వారు బిజీగా ఉంటారు. ఇదిలా ఉండగా తాజాగా రష్మిక విషయంలో కూడా హీరో ఆనంద్ దేవరకొండ కూడా ఇలాగే వ్యవహరించాడు.హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.’ దొరసాని ‘ సినిమా ద్వారా హీరోగా వెండితెరకు పరిచయమైన ఆనంద్ ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీ సినిమా ద్వారా హిట్ అందుకున్నాడు.
ఆ తర్వాత ఆనంద్ హీరోగా వచ్చిన ‘ పుష్పకవిమానం ‘ సినిమా ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం ఆనంద్ ‘ బేబీ ‘ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ పనులతో ఆనంద్ బిజీగా ఉన్నాడు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా హైదరాబాద్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆనంద్ అసహనం వ్యక్తం చేశాడు. గత కొంతకాలంగా విజయ్ దేవరకొండ రష్మిక రిలేషన్ గురించి సోషల్ మీడియాలో అనేక వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఒక విలేకరి ” మీ సినిమాలోని ఓ పాట ని రష్మిక రిలీజ్ చేశారు కదా. ఆ సాంగ్ ఈవెంట్‌కి వచ్చిన వాళ్లందరూ ఆమెను ‘వదినా’ అని గట్టిగా పిలిచారు కదా..’’ అని ప్రశ్న అడిగాడు.. దీంతో ఆనంద్ స్పందిస్తూ అసహనం వ్యక్తం చేశాడు. ‘‘నో.. నేను దీన్ని ఇక్కడితో ఆపేస్తాను’’ అని సమాధానం ఇచ్చాడు. అంటే రష్మిక విజయ్ దేవరకొండ రిలేషన్ గురించి వినిపిస్తున్న వార్తలపై స్పందించడానికి ఆనంద్ ఆసక్తి చూపటం లేదు. దీంతో వారిద్దరి నిజంగానే రిలేషన్ లో ఉన్నారా? లేదా? అనే అనుమానం ఇంకా అలాగే ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…