Analyst Damu Balaji : అవినాష్ రెడ్డి కోసం సిబిఐ తో జగన్ పోరాటం… ఢిల్లీ లో ఏం జరిగిందంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో పూటకో వార్త బయటికి వస్తున్నా అసలు నిందితులు బయటికి రావడం లేదు. అయితే సిబిఐ కావాలనే అవినాష్ రెడ్డిని టార్గెట్ చేస్తోందంటూ ఒకవైపు వినిపిస్తున్నా విచారణకు అవినాష్ రెడ్డి హాజరువ్వాల్సిన సమయంలో అవినాష్ రెడ్డి తల్లి శ్రీ లక్ష్మికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్ కి తరలించడం, ఆ కారణంతో సిబిఐ విచారణకు గడువు కోరడంతో అవినాష్ రెడ్డి విచారణ తప్పించుకోడానికి కావాలనే ఇలా చేస్తున్నడంటూ విపక్షాలు విమర్శిస్తుంటే మరోవైపు వైఎస్ శ్రీలక్ష్మి పరిస్థితి సీరియస్ గా ఉందని వైఎస్ కుటుంబ నుండి విజయమ్మ, వివేకానంద రెడ్డి చెల్లి విమలా రెడ్డి పరామర్శించారు. ఇక అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై విచారణ జరిపిన హై కోర్ట్ తీర్పును రిజర్వు చేసి పెట్టింది. అయితే అవినాష్ రెడ్డి ని కాపాడటం కోసం జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటూ టీడీపీ పార్టీ నేతలు విమర్శలు చేస్తుండగా ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ ఢిల్లీ టూర్ అందుకే…

ఏపీ సీఎం జగన్ తాజాగా ఢిల్లీ వెళ్లి అక్కడ కేంద్ర మంత్రులను కలిసి మరోవైపు మోడీ, అమిత్ షా లను కలసే ప్రయత్నం చేయగా ఇవన్నీ అవినాష్ ను సిబిఐ నుండి కాపాడటానికి జగన్ చెస్తున్న ప్రయత్నాలు అంటూ టీడీపీ అనుకూల వర్గం మాట్లాడుతోందని బాలాజీ తెలిపారు. నిజానికి నీతి ఆయోగ్ మీటింగ్ కోసం అలాగే పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంకు హాజరువడానికి వెళ్లారు.

అక్కడ అలాగే పలువురు కేంద్ర మంత్రులను కలవడం, సుప్రీం కోర్టు న్యాయవాది ఇంతకుముందు ఏపీ లో పనిచేసిన మిశ్రా గారు కనిపించడంతో పలకరించారు. దాంతో ఒక వర్గం మీడియా జగన్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు, సిబిఐతో పోరాడుతున్నాడు, ఢిల్లీ పెద్దలను కలిసి సిబిఐ అధికారులను మార్చాలని ప్రయత్నిస్తున్నాడు అంటూ కథనాలు అల్లేస్తున్నారని బాలాజీ ఆయన అభిప్రాయాలను తెలిపారు.