Categories: FeaturedMovie News

Analyst Damu Balaji : చెన్నై ఇంట్లో శరత్ బాబు డైరీ… అందులో ఆస్తుల గురించి ఏముందంటే…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : హీరోగానూ, విలన్ గానూ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన నటుడు శరత్ బాబు గారు అనారోగ్య సమస్యల్తో చికిత్స అందుకుంటూ తుది శ్వాస విడిచారు. దాదాపు నేల పైగానే హాస్పిటల్ లో ఉన్న ఆయన చెన్నై నుండి బెంగళూరు ఆ తరువాత హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యారు. 72 ఏళ్ల వయసులో శరత్ బాబుగారు మృతి చెందారు. ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చాక నటి రమాప్రభ గారిని ప్రేమ వివాహం చేసుకున్నారు. 15 ఏళ్ల తరువాత విడిపోయిన ఆయన మళ్ళీ తమిళ నటిని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో కూడా విడాకులు తీసుకున్నారు. చాలా ఏళ్లుగా ఒంటరిగా జీవిస్తున్న శరత్ బాబు గారికి అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు దాదాపు 13 మంది ఉన్నారు. ఇక వారి కుటుంబ గురించి ఆస్తి గొడవల గురించి అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

డైరీలో ఏముందంటే…

శరత్ బాబు గారికి సంతానం లేకపోవడం వల్ల ఆయన అన్నదమ్ముల పిల్లలను చేరదీసారట. వారి చదువులు అన్ని విషయాలు ఆయనే చూసుకుని ఆస్తి కూడా 13 బాగాలను చేసి అందరికీ పంచారట. తనకంటూ కొంత ఆస్తి పెట్టుకుని మిగిలినది అందరికీ ఇచ్చేసినా ఇప్పుడు మిగిలిన ఆస్తి కోసం గొడవలు జరుగుతున్నాయనే పుకార్లు వినపడుతున్నాయని అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు. తాజాగా ఆయన డైరీ ఒకటి దొరిందని, అందులో ఆస్తికి సంబంధించిన విషయాలను రాసుకొచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయని తెలిపారు.

నిజానికి శరత్ బాబు గారికి డైరీ రాసే అలవాటు ఉంది కానీ ఆయన రాస్తున్న డైరీ ఇప్పటికీ ఎవరికీ అందలేదు. అదీకాక ఆయన ఎలాంటి వీలునామా కూడా రాసినట్లుగా కనిపించడం లేదంటూ బాలాజీ తెలిపారు. ఆస్తులన్నీ ఆల్రెడీ ఇచ్చేసినా తనకంటూ హైదరాబాద్ లో ఒక ఇల్లు, మదనపల్లి లో ఒక అతిధి గృహం, చెన్నై లో ఇల్లు కొన్ని షాప్స్ పెట్టుకోగా వచ్చే రెంట్స్ కూడా తన సోదరుల పిల్లలకోసం ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు ఈ మిగిలిన ఆస్తుల కోసం అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపారు బాలాజీ.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago