Niharika: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం బాలి వెకేషన్ లో ఉన్న విషయం మనకు తెలిసిందే. తాజాగా ఈమె డెడ్ పిక్సెల్ వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ మంచి ఫలితాలను అందుకోవడంతో ఈమె ఈ సక్సెస్ ను తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన స్నేహితులతో కలిసి నిహారిక బాలి వెకేషన్ వెళ్ళిన విషయం మనకు తెలిసిందే.
ఇలా ఈ వెకేషన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తనకు కలిగిన అనుభవాలు అనుభూతులను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా ఈ వెకేషన్ కి సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు. నిహారిక అక్కడ ప్రకృతిలో లీనమై ఉన్నటువంటి ఒక ఫోటోని షేర్ చేస్తూ తన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
తాను గత కొద్దిరోజులుగా అనుభవిస్తున్నటువంటి విషయాలన్నింటినీ మాటలలో వర్ణించలేను.అయితే ఇప్పుడు తను చేస్తున్న అన్ని పనులు తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తున్నాయని నిహారిక తెలియజేశారు. తాను అనుకున్న పనులన్నింటినీ పూర్తి చేస్తున్నానని ఇలా చిన్న చిన్న విషయాలే తనుకు పెద్ద సంతోషాన్ని కలిగిస్తున్నాయి అంటూ ఈ సందర్భంగా ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.
ఇక ఈ ప్రదేశం నన్ను నేను మళ్ళీ వెతుక్కోవడానికి ఎంతో ఉపయోగపడిందని నిహారిక తెలియజేశారు.ఈ బాలీ దీవులే తనకు ఒక అమ్మగా గురువుగా ఎంతో ఉపయోగపడ్డాయని తెలియజేస్తూ ప్రత్యేకంగా బాలీ దీవులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు.ఇలా నిహారిక తాను అనుకున్న పనులన్నీ పూర్తి అవుతున్నాయని తాను సంతోషంగా ఉన్నానని చెబుతూ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…