Analyst Damu Balaji : ఆ అక్రమ సంబంధాలే వివేకానంద రెడ్డి హత్యకు కారణం… షర్మిల, విజయమ్మ మౌనం వెనుక…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సంచలనమైన రాజకీయ హత్య వైఎస్ వివేకానంద మర్డర్. ఆయనను హత్య చేసింది ఎవరు అన్నది ఎపుడు తెలుస్తుందో, శిక్ష ఎపుడు పడుతుందో తెలియదు కానీ కేసు విచారణ జరుగుతూ రోజుకో వ్యక్తి పేరు బయటికి వస్తోంది. ఇవన్నీ చాలవు అన్నట్లుగా ఆయనకున్న అక్రమ సంబంధాల వల్లే ఆయనని దారుణంగా చంపారంటూ మరో వాదన వినిపిస్తోంది. అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి కూడా వివేకానంద రెడ్డి సునీల్ యాదవ్ తల్లిని లైంగికంగా వేదించాడంటూ చెప్పడంతో ఈ వాదనలు మరింత ఎక్కువయ్యాయి అంటూ అనలిస్ట్ దాము బాలాజీ అభిప్రాయాపడ్డారు.

అక్రమ సంబంధాలే మరణానికి కారణం…

వైఎస్ వివేకానంద రెడ్డి గతంలో తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో ముస్లిమ్ మహిళను పెళ్లి చేసుకుని ఆయన పేరు కూడా షేక్ అక్బర్ రెడ్డి గా మార్చుకున్నారు, ఇది బయట బాగా ప్రచారంలో ఉంది, అలాగే ఆయనే స్వయంగా ఒప్పుకున్నారు కూడా అంటూ బాలాజీ తెలిపారు. ఇక వారికి ఒక కొడుకు కూడా ఉండగా అతనికే ఆస్తి మొత్తం వివేకానంద రెడ్డి ఇచ్చేస్తాడనే అనుమానంతో కూతురు సునీత రెడ్డి హత్య చేయించారు అనే వాదన ఉండగా, మరో వైపు అవినాష్ రెడ్డి మూడోసారి సిబిఐ విచారణకు హాజరై బయటికి వచ్చిన సమయంలో హత్య చేసిన వాళ్లలో ఒకడైన ఉమాశంకర్ రెడ్డి తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడనే కోపంతోనే వివేకానందను హత్య చేసాడంటూ చెప్పారు.

సునీల్ యాదవ్ తల్లిని అలాగే ఉమా శంకర్ రెడ్డి భార్యను వేదిస్తున్నాడానే కోపంతోనే వారిద్దరూ ఒక్కటై ప్లాన్ చేసి హత్య చేసారని అవినాష్ తరుపున వాదన వినిపిస్తోంది. అయితే ఈ మొత్తం కథలో షర్మిల కానీ విజయమ్మ కానీ ఒక్క మట మాట్లాడటం లేదు. ఎంపీ సీటు విషయంలోనే అసలు గొడవ వచ్చుంటే వారెందుకు మౌనంగా ఉన్నారు. లేక వాళ్ళు కూడా అవినాష్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారా అన్నది తెలియాలి అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.