Movie News

Actress Nagma: నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి… అందరి ముందు నగ్మను అవమానించిన స్టార్ హీరో?

Actress Nagma: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన అలనాటి సీనియర్ నటుడు శోభన్ బాబు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించిన శోభన్ బాబుకి ఆ రోజుల్లోనే భారీగా లేడి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. నటనపరంగా మాత్రమే కాకుండా మహిళలను గౌరవించడంలో కూడా శోభన్ బాబు అందరికీ ఆదర్శంగా ఉండేవాడు.

ఒకానొక సమయంలో శోభన్ బాబు ఒక హీరోయిన్ ని అందరి ముందు దారుణంగా అవమానించినట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. శోభన్ బాబు చేతిలో అవమానించబడిన హీరోయిన్ మరెవరో కాదు నగ్మా. శోభన్ బాబు, నగ్మా జంటగా అడవి దొర సినిమాలో నటించారు. అప్పట్లో ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అయితే ఆ షూటింగ్ సమయంలో ఒకానొక సందర్భంలో శోభన్ బాబు నగ్మా మీద కోపగించుకొని ఆమెను అవమానపరిచినట్లు తెలుస్తోంది.

శోభన్ బాబు ఆమె మీద కోప్పడటానికి కారణం కూడా లేకపోలేదు. అడవి దొర సినిమాలోని ఒక పాట కోసం చైనా సరిహద్దుకు సమీపంలో చిత్రయూనిట్ వెళ్లింది. అయితే ఆ సమయంలో షూటింగ్ స్పాట్ కి అందరూ వచ్చినా కానీ.. నగ్మా మాత్రం రాలేదట. ఆమె కోసం చిత్రయూనిట్ మొత్తం దాదాపు గంటన్నర పాటు ఎదురు చుస్తే అప్పుడు సెట్ లోకి నగ్మా సెట్ లోకి వచ్చిందట.

Actress Nagma: టైమ్ సెన్స్ ఉండాలి…


ఈ విధంగా ఆమె ఆలస్యంగా రావడమే కాకుండా.. అడిగిన ప్రశ్నలకు సరైనా సమాధానాలు చెప్పకపోవడంతో శోభన్ బాబుకు బాగా కోపం వచ్చిందట. దీంతో నగ్మాను పిలిచి నీ ఆస్తి మొత్తం ఎంత ఉంటుందని అడిగ్గా.. అందుకు ఆమె సమాధానం చెప్పగా.. ‘ నా బాత్రూం విలువ చేయదు నీ ఆస్తి. బిహేవ్ ప్రొపర్లి. టైమ్ సెన్స్ ఉండాలి అంటూ అందరిముందు నగ్మా మీద సీరియస్ అయ్యారట. అయితే శోభన్ బాబు అలా అనడంతో నగ్మా సైలెంట్ అయ్యిందట. ఆ తర్వాత శోభన్ బాబు బ్యాగ్రౌండ్ తెలుసుకుని నగ్మా షాక్ అయ్యిందట.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago