Analyst Damu Balaji : సమంత ప్రధానపాత్రలో తెరకెక్కిన హిస్టారికల్ మూవీ శాకుంతలం. ఇటీవలే విడుదల అయిన సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇందులో సమంతకు జోడిగా మలయాళం హీరో దేవ్ మోహన్ నటిస్తున్నారు. శాకుంతలం సినిమా మహా కవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం నుండి తీసుకున్న కథ. నీలిమ గుణ, దిల్ రాజు కలిసి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు డైరెక్టర్ గుణశేఖర్ గారు. ఈ సినిమా తాజాగా విడుదల అయి థియేటర్లలో సందడి చేస్తోంది. అయితే సినిమాలో కొన్ని లోపాలు అలాగే గ్రాఫిక్స్ సరిగా లేకపోవడం వల్ల సినిమా ప్రేక్షకులను నిరాశ పరిచిందనే చెప్పొచ్చు. ఇక ఈ సినిమా ఫలితంతో నాకేం సంబంధం లేదంటూ సమంత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం గురించి అనలిస్ట్ దాము బాలాజీ గారు ఆయన విశ్లేషణ అందించారు.
భగవద్గీత శ్లోకంతో సమంత…
శాకుంతలం సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ అవ్వలేదు. ఇక సమంత మొహం ఫ్రెష్ గా సినిమాలో అనిపించలేదు. చిన్నవయసు అమ్మాయి అయి ఉంటే శకుంతల పాత్రకు ఇంకా బాగుండేది అన్న అభిప్రాయం అందరిలోనూ కలిగింది అంటూ దాము బాలాజీ మాట్లాడారు. ఇక సినిమా ఫ్లాప్ అవడం గురించి సమంత పరోక్షంగా మాట్లాడటం గురించి ఆయన మాట్లాడుతూ భగవద్గీత లోని ఒక శ్లోకాన్ని చెబుతూ నేను సినిమాలో నటించాను అంతే, సినిమా ఫలితంకి నేను బాధ్యురాలిని కాదు అన్నట్లుగా ఆమె మాట్లాడారు అంటూ అభిప్రాయపడ్డారు.
క్రిస్టియన్ అయిన సమంత ఇలా భగవద్గీత శ్లోకం పెట్టడం, అందులోనూ ఖచ్చితంగా అది శాకుంతలం సినిమా ఫ్లాప్ అవడం గురించే అంటూ చర్చలు నడుస్తున్నాయని బాలాజీ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం సమంత లండన్ లో సిటడెల్ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ కోసం వెళ్లారు అంటూ చెప్పారు. తన పని తాను చేసుకుపోతానని ఫలితంతో నాకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేసింది సామ్.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…