Featured

MP Vijaya Sai Reddy : ఒకే ఒక్క ట్వీట్‌తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన విజయసాయిరెడ్డి.. వైసీపీ ఝలక్ ఇవ్వబోతున్నారా? ఆయన మౌనానికి అర్థమేంటి?

MP Vijaya Sai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలకు ఇచ్చే కౌంటర్లకు కనీసం రీ కౌంటర్ ఇచ్చే నేతలు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలపై అవకాశం దొరికితే చాలు బీభత్సంగా విరుచుకుపడేవారు. ఎన్నో సార్లు ఏపీ సీఎం జగన్‌కు విజయసాయిరెడ్డికి పొసగడం లేదంటూ వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు అవన్నీ అసత్యాలని నిరూపిస్తూ వస్తున్నారు. వైసీపీలో కీలక నిర్ణయాల వెనుక ఆయన ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. ఒకరకంగా వైసీపీకి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు.

అలాంటి విజయసాయిరెడ్డి సడెన్‌గా మౌన మునిలా మారిపోయారు. విపత్కర సమయంలోనూ పార్టీకి అండగా నిలుస్తున్నది లేదు. ఏపీలో వైఎస్ వివేకా కేసు పెను దుమారాన్ని రేపుతోంది. పార్టీని వెనకేసుకొచ్చేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి మద్దతుగా నిలిచింది లేదు. అసలు విజయసాయి రెడ్డికి ఏమైంది? ఏం ట్వీట్ చేసి రాజకీయాల్లో ప్రకనంపలు రేపారు? ఒకసారి చూద్దాం.

జగన్ ట్వీట్ చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపడేవారు కాదు కానీ..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తమ అధినేత పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా చంద్రబాబుకు విషెస్ చెబుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేసినా కూడా పెద్దగా ఎవరూ ఆశ్చర్యపడేవారు కాదేమో కానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ రాజకీయంగా కూడా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు.. ‘మీరు మారిపోయార్ సార్..’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మీ నుంచి ఇది ఊహించలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడుకి ట్విటర్ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

అలకబూనినట్టు అప్పట్లో టాక్..

ఏ ఎమ్మెల్సీ ఎన్నికలైతే వైసీపీకి షాక్ ఇచ్చాయో.. అదే సమయంలో విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి షాక్ ఇచ్చారు. కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థి తరుఫున ప్రచారం నిర్వహించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆది నుంచి కూడా దూరంగానే ఉన్నారు. వైజాగ్‌లో విజయసాయిరెడ్డి తన ఓటును నమోదు చేసుకున్నారు. అనంతరం కనీసం అభ్యర్థులకు మద్దతుగా కూడా నిలబడకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా నియమించిన తరువాత విజయసాయిరెడ్డి అలకబూనినట్టు అప్పట్లో టాక్ నడిచింది. అసలు జగన్‌కు విజయసాయిరెడ్డికి పడటం లేదంటూ పెద్ద ఎత్తున టాక్ నడిచింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం సహా .. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి విజయసాయిరెడ్డి చేసిన కృషి అపారం. వైసీపీకి సోషల్ మీడియా వింగ్ ఎంత కీలకమనేది మాటల్లో చెప్పలేం. అలాంటి వైసీపీ సోషల్ మీడియాను దూకుడుగా ముందుకు నడిపించడంలోనూ సాయిరెడ్డి కృషిని మాటల్లో చెప్పలేం. అలాంటి వ్యక్తి ఎందుకు మౌనం దాల్చారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీ కూడా.. విజయసాయికి ఒక్క ఎంపీ పదవి తప్పితే.. ఎలాంటి పదవీ ఇవ్వలేదు.. ఇచ్చిన వాటిని కూడా లాగేసింది. దీంతో విజయసాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని టాక్.

చంద్రబాబుతో చనువుగా వ్యవహరించడంతో..

అంతకు ముందు కూడా సినీ నటుడు తారకరత్న అంత్యక్రియల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చాలా చనువుగా వ్యవహరించారు. అది చూసి అంతా షాక్ అయ్యారు. చంద్రబాబు అంటేనే పడని వ్యక్తి అంత చనువుగా వ్యవహరించడంతో రకరకాల ఊహాగానాలు బయలు దేరాయి. అప్పట్లో.. చంద్రబాబు, విజయసాయి పక్క పక్కనే కూర్చోవడం.. మీడియా ముందుకు రావడం.. కార్ దాకా వెళ్లి బాబును సాగనంపిన దగ్గర నుంచి తేడా కొడుతోంది. అయితే అదే సమయంలో సీఎం జగన్ కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లకు తారకరత్న వ్యవహారంలో వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ విజయసాయిరెడ్డి జగన్ ఆదేశాలను పక్కనబెట్టి ఢిల్లీకి వెళ్లిపోయారని అప్పట్లో బీభత్సంగా టాక్ నడిచింది. ఈ క్రమంలోనే ఆయనపై జగన్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇక అన్ని పరిణామాలను చూస్తుంటే విజయసాయిరెడ్డి.. టీడీపీలోకి వెళ్లడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి దీన్ని కేవలం ప్రచారంగానే చూడాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి వంటి కీలక వ్యక్తి పార్టీ మారడమనేది చాలా పెద్ద విషయం. జగన్‌తో కొంచెం డిస్టెన్స్ పెరిగిన మాటైతే వాస్తవం. ఇవన్నీ వానకు ముందు పట్టే మబ్బుల మాదిరిగానే చూడాలి.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago