Featured

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సంచలనం… అవినాష్ రెడ్డి నిర్దోషి… సిబిఐ కి షాక్ ఇచ్చిన హై కోర్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు పూటకో మలుపు తిరుగుతూనే డైలీ సీరియల్ లాగా సాగుతోంది. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉంది అంటూ సిబిఐ ఆయనను అరెస్టు చేయాలని భావిస్తుంటే మరోవైపు అవినాష్ రెడ్డికి ఆ కేసుతో సంబంధం లేదు అంటూ హై కోర్ట్ లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న జరిగిన విచారణలో సిబిఐ తరుపున న్యాయవది అవినాష్ రెడ్డిని సిబిఐ కస్టడీ కోరుతూ వాదనలు వినిపించగా అసలు కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటూ అవినాష్ రెడ్డి తరుపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. ఇక హై కోర్ట్ ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

సిబిఐ కి షాక్, అవినాష్ రెడ్డికి ఊరట…

వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డి కూడా హత్య విషయంలో ఉండగా అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది మాత్రం అవినాష్ రెడ్డికి వివేకానంద చనిపోయిన విషయం చెప్పింది వివేకానంద కూతురు అయిన సునీత రెడ్డి భర్త నర్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడే. ఆయన ఫోన్ చేసి చెప్పిన తరువాతే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అంటూ వాదించారు. సిబిఐ ఆయనను విచారించడం లేదని కేవలం కేసును ఒక కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తుందంటూ గట్టిగా ఆయన వాదన వినిపించారు.

ఇక హై కోర్ట్ అవినాష్ ను అరెస్టు చేసే విషయంలో 25 తేదీ వరకు చేయకూడదని సిబిఐ కు ఆదేశించగా అలాగే విచారణకు ఎపుడు పిలిచినా అవినాష్ హాజరు కావాలని తెలిపారు. ఇక కేసులో కీలకంగా ఉన్న భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి లను కూడా సిబిఐ కస్టడీ కి కోరగా కోర్ట్ ఈ నేల 24 వరకు సమయం ఇచ్చింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక కేసులో సిబిఐ విచారణ కేవలం ఆవినాష్ రెడ్డి వైపు నుండి మాత్రమే జరుగుతోందని అన్ని కొనాలలోనూ సిబిఐ విచారణ జరపడం లేదంటూ అభిప్రాయపడ్డారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago