Connect with us

Featured

MP Vijaya Sai Reddy : ఒకే ఒక్క ట్వీట్‌తో ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపిన విజయసాయిరెడ్డి.. వైసీపీ ఝలక్ ఇవ్వబోతున్నారా? ఆయన మౌనానికి అర్థమేంటి?

Published

on

MP Vijaya Sai Reddy : వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పుడు ఏపీ పొలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారారు. ఒకప్పుడు విజయసాయి రెడ్డి ప్రతిపక్షాలకు ఇచ్చే కౌంటర్లకు కనీసం రీ కౌంటర్ ఇచ్చే నేతలు కూడా లేరంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్షాలపై అవకాశం దొరికితే చాలు బీభత్సంగా విరుచుకుపడేవారు. ఎన్నో సార్లు ఏపీ సీఎం జగన్‌కు విజయసాయిరెడ్డికి పొసగడం లేదంటూ వార్తలు వచ్చాయి. కానీ ఎప్పటికప్పుడు అవన్నీ అసత్యాలని నిరూపిస్తూ వస్తున్నారు. వైసీపీలో కీలక నిర్ణయాల వెనుక ఆయన ఉంటారనడంలో అతిశయోక్తి కాదు. ఒకరకంగా వైసీపీకి ఆయన వెన్నుదన్నుగా నిలిచారు.

అలాంటి విజయసాయిరెడ్డి సడెన్‌గా మౌన మునిలా మారిపోయారు. విపత్కర సమయంలోనూ పార్టీకి అండగా నిలుస్తున్నది లేదు. ఏపీలో వైఎస్ వివేకా కేసు పెను దుమారాన్ని రేపుతోంది. పార్టీని వెనకేసుకొచ్చేందుకు వైసీపీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీకి మద్దతుగా నిలిచింది లేదు. అసలు విజయసాయి రెడ్డికి ఏమైంది? ఏం ట్వీట్ చేసి రాజకీయాల్లో ప్రకనంపలు రేపారు? ఒకసారి చూద్దాం.

జగన్ ట్వీట్ చేసినా కూడా పెద్దగా ఆశ్చర్యపడేవారు కాదు కానీ..

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వేడుకలు జరుగుతున్నాయి. టీడీపీ కార్యకర్తలు, నాయకులు ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున తమ అధినేత పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారు. ఇక రాజకీయ, సినీ ప్రముఖులు ట్విటర్ వేదికగా చంద్రబాబుకు విషెస్ చెబుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా సీఎం జగన్ ట్వీట్ చేసినా కూడా పెద్దగా ఎవరూ ఆశ్చర్యపడేవారు కాదేమో కానీ.. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేయడం ఆసక్తిని రేకెత్తించింది. ‘‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ రాజకీయంగా కూడా ఏపీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. పెద్ద ఎత్తున నెటిజన్లు.. ‘మీరు మారిపోయార్ సార్..’ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. మీ నుంచి ఇది ఊహించలేదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు నాయుడుకి ట్విటర్ వేదికగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

అలకబూనినట్టు అప్పట్లో టాక్..

ఏ ఎమ్మెల్సీ ఎన్నికలైతే వైసీపీకి షాక్ ఇచ్చాయో.. అదే సమయంలో విజయసాయిరెడ్డి సైతం వైసీపీకి షాక్ ఇచ్చారు. కనీసం ఎమ్మెల్సీ అభ్యర్థి తరుఫున ప్రచారం నిర్వహించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఆది నుంచి కూడా దూరంగానే ఉన్నారు. వైజాగ్‌లో విజయసాయిరెడ్డి తన ఓటును నమోదు చేసుకున్నారు. అనంతరం కనీసం అభ్యర్థులకు మద్దతుగా కూడా నిలబడకుండానే ఢిల్లీకి వెళ్లిపోయారు. వైవీ సుబ్బారెడ్డిని ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా నియమించిన తరువాత విజయసాయిరెడ్డి అలకబూనినట్టు అప్పట్లో టాక్ నడిచింది. అసలు జగన్‌కు విజయసాయిరెడ్డికి పడటం లేదంటూ పెద్ద ఎత్తున టాక్ నడిచింది. పార్టీని అధికారంలోకి తీసుకురావడం సహా .. ముఖ్యంగా ఉత్తరాంధ్రలో పార్టీని బలోపేతం చేయడానికి విజయసాయిరెడ్డి చేసిన కృషి అపారం. వైసీపీకి సోషల్ మీడియా వింగ్ ఎంత కీలకమనేది మాటల్లో చెప్పలేం. అలాంటి వైసీపీ సోషల్ మీడియాను దూకుడుగా ముందుకు నడిపించడంలోనూ సాయిరెడ్డి కృషిని మాటల్లో చెప్పలేం. అలాంటి వ్యక్తి ఎందుకు మౌనం దాల్చారనేది ఆసక్తికరంగా మారింది. దీనికి కారణం లేకపోలేదు. వైసీపీ కూడా.. విజయసాయికి ఒక్క ఎంపీ పదవి తప్పితే.. ఎలాంటి పదవీ ఇవ్వలేదు.. ఇచ్చిన వాటిని కూడా లాగేసింది. దీంతో విజయసాయిరెడ్డి అసంతృప్తితో ఉన్నారని టాక్.

చంద్రబాబుతో చనువుగా వ్యవహరించడంతో..

అంతకు ముందు కూడా సినీ నటుడు తారకరత్న అంత్యక్రియల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో విజయసాయిరెడ్డి చాలా చనువుగా వ్యవహరించారు. అది చూసి అంతా షాక్ అయ్యారు. చంద్రబాబు అంటేనే పడని వ్యక్తి అంత చనువుగా వ్యవహరించడంతో రకరకాల ఊహాగానాలు బయలు దేరాయి. అప్పట్లో.. చంద్రబాబు, విజయసాయి పక్క పక్కనే కూర్చోవడం.. మీడియా ముందుకు రావడం.. కార్ దాకా వెళ్లి బాబును సాగనంపిన దగ్గర నుంచి తేడా కొడుతోంది. అయితే అదే సమయంలో సీఎం జగన్ కూడా పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి చంద్రబాబు, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌లకు తారకరత్న వ్యవహారంలో వ్యతిరేకంగా మాట్లాడాలని విజయసాయిరెడ్డిని జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కానీ విజయసాయిరెడ్డి జగన్ ఆదేశాలను పక్కనబెట్టి ఢిల్లీకి వెళ్లిపోయారని అప్పట్లో బీభత్సంగా టాక్ నడిచింది. ఈ క్రమంలోనే ఆయనపై జగన్ ఫైర్ అయినట్టు తెలుస్తోంది. ఇక అన్ని పరిణామాలను చూస్తుంటే విజయసాయిరెడ్డి.. టీడీపీలోకి వెళ్లడం ఖాయమంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి దీన్ని కేవలం ప్రచారంగానే చూడాలి. ఎందుకంటే విజయసాయిరెడ్డి వంటి కీలక వ్యక్తి పార్టీ మారడమనేది చాలా పెద్ద విషయం. జగన్‌తో కొంచెం డిస్టెన్స్ పెరిగిన మాటైతే వాస్తవం. ఇవన్నీ వానకు ముందు పట్టే మబ్బుల మాదిరిగానే చూడాలి.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Siddharth -Aditi: రహస్యంగా పెళ్లి చేసుకుని షాక్ ఇచ్చిన అదితి సిద్ధార్థ్?

Published

on

Siddharth -Aditiy: సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతూ ఉన్నటువంటి వారిలో
సిద్ధార్థ్ అదితి రావు హైదరి జంట ఒకటి. వీరిద్దరూ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే వీరిద్దరూ కలిసి అవే భూపతి దర్శకత్వంలో వచ్చిన మహాసముద్రం సినిమాలో కలిసిన నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు..

ఇక వీరిద్దరూ కలిసి ముంబైలో సహజీవనం చేస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసి జంటగా వెళ్లారు. అయితే వీరి రిలేషన్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కానీ వీరు మాత్రం ఎప్పుడూ కూడా తమ రిలేషన్ గురించి ఓపెన్ అవ్వలేదు. ఇలా రహస్యంగా తమ రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నటువంటి ఈ జంట ఇటీవల రహస్యంగా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు.

ఇలా ముంబైలో సహజీవనం చేస్తున్నటువంటి ఈ జంట తెలంగాణలోని వనపర్తి జిల్లా శ్రీరంగాపూర్‌లోని రంగనాథ స్వామి ఆలయ మండపంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యులతో వీరి వివాహ వేడుక హిందూ సాంప్రదాయ పద్ధతిలో జరిగింది. ఇలా వీరిద్దరు పెళ్లి చేసుకున్నారనే వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అవుతారు.

Advertisement

తెలంగాణలో వివాహం..
రిలేషన్ లో ఉన్నటువంటి ఈ జంట ఇలా రహస్యంగా పెళ్లి చేసుకోవడానికి గల కారణం ఏంటని ఆరా తీస్తున్నారు అయితే ఇలా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నప్పటికీ ఇద్దరికీ ఇది మొదటి వివాహం కాదని వీరిద్దరికీ ఇది రెండో వివాహమనే చెప్పాలి ఇప్పటికే వీరిద్దరూ పెళ్లిళ్లు చేసుకొని విడాకులు తీసుకొని ఒంటరిగా ఉంటూ తిరిగి రెండో పెళ్లి చేసుకున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pallavi Prashanth: ఖైదీలందరూ అలా మాట్లాడేవారు.. జైలు జీవితం పై పల్లవి ప్రశాంత్ కామెంట్స్!

Published

on

Pallavi Prashanth: పల్లవి ప్రశాంత్ పరిచయం అవసరం లేని పేరు. ఒక సాధారణ రైతుబిడ్డగా పొలం పనులు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయన ఎన్నో రకాల వీడియోలు చేస్తూ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేమస్ అయ్యారు. ఇలా యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉన్నటువంటి ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. హౌస్ లోకి అడుగు పెట్టినటువంటి ప్రశాంత్ అనంతరం విన్నర్ గా బయటకు వచ్చారు.

ఇక గ్రాండ్ ఫినాలే రోజు ఈయన అభిమానులు చేసిన హంగామా గురించి మనకు తెలిసిందే. పెద్ద ఎత్తున కార్లు ధ్వంసం చేయడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయడంతో ఈయనపై కేసులు పెట్టి జైలుకు పంపించారు. అయితే బెయిలు మీద బయటకు వచ్చినటువంటి పల్లవి ప్రశాంత్ తన రెండు రోజుల జైలు జీవితం గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

తాను రెండు రోజులపాటు జైలులో చాలా ఇబ్బంది పడ్డాను అని తెలిపారు. బాధతో భోజనం కూడా చేయలేదని కానీ తోటి ఖైదీలు చెప్పడంతో భోజనం చేశానని జైలు కూడు బాగుందని తెలిపారు. నన్ను వీఐపీ ఇలా ట్రీట్ చేసిన లేక సాధారణంగా ట్రీట్ చేసిన కూడా అక్కడ భోజనం బాగుందని ఈయన వెల్లడించారు. ఇక ఖైదీలు అందరూ కూడా నాతో మాట్లాడుతూ బిగ్ బాస్ గురించి ప్రశ్నలు వేసే వాళ్ళు విన్నర్ ఎవరంటూ కూడా అడిగేవారు.

Advertisement

బిగ్ బాస్ గురించి అడిగేవారు..
ఇక నేను వెళ్ళిన తర్వాత జైలుకు వచ్చిన వారు బయట జరిగిన గొడవ గురించి తెలిపే వారని ప్రశాంత్ తెలిపారు. అయితే నేను జైలులో ఉంటే ఏ మాత్రం భయపడలేదు నేను తప్పు చేయలేదు అందుకే ఎవరికి భయపడలేదని కానీ నాపై విమర్శించిన వారికి కూడా అదే గతే పడుతుంది అంటూ ఈ సందర్భంగా జైలు జీవితం గురించి ప్రశాంత చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Teenmar Mallanna: సమంత నాగచైతన్య విడాకులకు ఫోన్ ట్యాపింగ్ కారణం: తీన్మార్ మల్లన్న

Published

on

Teenmar Mallanna: తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం రేపుతుంది. ఈ వ్యవహారంలో భాగంగా సరికొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలోనే తీన్మార్ మల్లన్న ఓ వీడియో ద్వారా ఈ వ్యవహారం గురించి మాట్లాడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీ కపుల్ అయినటువంటి సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కారణమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ..నటి ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, ఆమెతో భేరసారాలు చేశారని, అది వర్కౌట్‌ కాకపోవడంతో హీరో ఫ్యామిలీకి ఈ వీడియో ఇచ్చేశారని ఆయన వెల్లడించారు. సమంత, చైతూ విడిపోవడంలో ఓ పెద్ద పొలిటికల్‌ లీడర్‌ ప్రమేయం ఉందని వెల్లడించారు.

ఈయన రాజకీయ నాయకుడు మాత్రమే కాకుండా మందుల వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఇలా ఈమె ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ వీడియోలను అక్కినేని ఫ్యామిలీకి పంపించడంతోనే అక్కినేని కుటుంబంలో విభేదాలు రావడం నాగచైతన్య తనకు విడాకులు ఇవ్వడం జరిగింది అంటూ తీన్మార్ మల్లన్న తెలిపారు.

Advertisement

పొలిటికల్ లీడర్..
ఈ విధంగా సమంత నాగచైతన్య విడిపోవడం వెనక ఉన్నటువంటి కారణం ఇదే అంటూ ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనగా మారాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఇక సమంత నాగచైతన్య విషయానికొస్తే వీళ్లిద్దరు విడాకులు తీసుకొని విడిపోయిన తర్వాత కెరియర్ పరంగా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!