Analyst Damu Balaji : జైల్లో ఎర్ర గంగిరెడ్డిని కలిసిన సునీత రెడ్డి… నిజానిజాలేమిటి…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి మరణించి నాలుగేళ్లు కావొస్తున్న చంపింది ఎవరనీకాని ఎవరు చంపారనే విషయాలు స్పష్టంగా ఇప్పటికీ తెలియరాలేదు. ఏపీ సీఎంకి సొంత బాబాయ్ అయినా ఎవరు చంపారో ఇప్పటికీ తెలియక పోవడం పట్ల అటు విపక్షాలా నుండి గట్టి విమర్శిలే ఎదుర్కొంటున్న జగన్ ఇంట్లోనే హంతకులున్నారనే కథనాలు వినిపిస్తున్న విమర్శకు కౌంటర్లు వేస్తున్నారే కానీ కేసులో మాత్రం పురోగతి లేదు. రోజుకో పేరు బయటికి వస్తుంది ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు అంటూ వార్తలు వినిపించినా అవేవి జరగలేదు.అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేయించాలని గట్టిగా అనుకుంటున్నా సునీత రెడ్డి తాజాగా జైల్లో ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కలిసినట్లు జగన్ మీడియా కథనాలు ప్రసారం చేయగా అందులో నిజానిజాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

జైల్లో ఎర్ర గంగిరెడ్డిని బెదిరించిన సునీత రెడ్డి….

వివేకానంద కేసులో దస్తగిరి తో పాటు నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి ప్రస్తుతం బెయిల్ రద్దు అయి జైల్లో ఉన్నారు. ఆయన అప్రూవర్ గా మారితే అవినాష్ మీద ఒత్తిడి తేవచ్చు అని సిబిఐ ఒకవైపు ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ గా మారమని ఒత్తిడి చేస్తున్నారు. ఇక ఎర్ర గంగిరెడ్డికి విచారణ అనంతరం కూడా బెయిల్ ఇవ్వకూడదని సునీత రెడ్డి పిటిషన్ వేశారు.

అయితే తాజాగా సునీత రెడ్డి జైల్లో ఎర్ర గంగిరెడ్డిని కలిసింది, బెదిరించింది అంటూ కథనాలు ప్రసారం కాగా జైలుకి వెళ్ళింది లాయర్ ద్వారా ఎర్ర గంగిరెడ్డిని కలిసింది అంటూ వార్తలు వచ్చాయి. వీటి గురించి దాముబాలాజీ మాట్లాడుతూ జైలు వద్దకు ఆమె వెళ్లిన నేరుగా కలిసే అవకాశం లేదు కనుక లాయర్ ద్వారా ఆమె చెప్పాలనుకున్నది చెప్పించి ఉండవచ్చు అంటూ చెప్పారు. ఎర్ర గంగిరెడ్డిని అప్రూవర్ గా మారమని సునీత రెడ్డి తరుపు లాయర్ ఒత్తిడి చేస్తున్నట్లుగా సమాచారం ఉందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.