Analyst Damu Balaji : టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి… అతను క్రిస్టియన్ అంటూ ఫైర్ అవుతున్న రాజాసింగ్…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రాజకీయాలకు నిలయం ఎపుడో అయింది. గుడి అభివృద్ధి కోసం ఏర్పడిన టీటీడీ పాలక మండలి నియామకం తదితర అంశాల్లో రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైంది. ఏపీ లో అధికార పార్టీ తన వాళ్లకు టీటీడీ చైర్మన్ పదవిని నియామక పోస్ట్ కింద ఇస్తుంది. అయితే హిందూ దేవాలయానికి అన్యమతస్థులను నియమించకుండా అలాగే తిరుమల పరిధిలో అన్యమత ప్రచారం జరగకుండా ప్రభుత్వం జాగ్రత పడుతుంది. తాజాగా టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి నియామకం గతంలోలాగానే ఇపుడు కూడా వివాదం అవుతోంది. ఇక ఈ ఇష్యూలో అనలిస్ట్ బాలాజీ అయన విశ్లేషణ అందించారు.

భూమన క్రిస్టియనా… హేతువాదా…

అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడుతూ భూన కరుణాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కూడా టీటీడీ చైర్మన్ గా పనిచేసారు. ఆ సమయంలో కూడా ఆయనకు ఎలా ఈ పదవి ఇచ్చారంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని తెలిపారు. తాజాగా భూమన గారు క్రిస్టియన్ అని ఆయనకు పదవి ఎలా ఇస్తారంటూ బీజేపీ నేత రాజాసింగ్ ఘాటు విమర్శల నడుమ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా ఈ విషయంలో మాట్లాడటంతో మరోసారి చర్చ మొదలయింది.

ఆయన క్రిస్టియన్ అంటూ డిక్లరేషన్ ను ఎన్నికల అఫిడవిట్ లో ఇచ్చారంటూ రాజసింగ్ చెబుతున్నా అది ఫేక్ అని అఫిడవిట్ లో అసలు కుల ప్రస్తావన ఉండదని బాలాజీ తెలిపారు. ఇక భూమన కూతుర్ని రాజశేఖర్ రెడ్డి బంధువైన రవీంద్ర రెడ్డి కొడుకుకి ఇచ్చి పెళ్లి చేసినపుడు క్రిస్టియన్ పద్ధతిలో వివాహం చేసారంటూ చెప్తున్నా వాటి గురించి మాట్లాడుతూ నాగార్జున నాగచైతన్య పెళ్లి క్రిస్టియన్ పద్ధతిలో చేసారు. అందుకని ఆయన క్రిస్టియన్ అయిపోరు కదా అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. భూమన నిజానికి రాడికల్స్ లో స్టూడెంట్ దశలో పనిచేయడం వల్ల ఆయన హేతువాది అనే ముద్ర కూడా పడింది. అందుకే ఆయన టీటీడీ చైర్మన్ గా ఉండకూడదని అంటున్నారు. కానీ ఆయన హేతువాది అని క్రిస్టియన్ అని ఎక్కడా క్లారిటీ లేదు. పైగా ఆయన గతంలో ఆల్రడీ చైర్మన్ గా పనిచేసినపుడు దళిత గోవిందం వంటి కార్యక్రమాలు చేసారంటూ బాలాజీ తెలిపారు.