Analyst Damu Balaji : భూ వివాదంలో ఇరుక్కున్న దగ్గుబాటి ఫ్యామిలీ… కోర్టు దిక్కరణ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీ…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : దగ్గుబాటి ఫ్యామిలీ అనగానే ఇండస్ట్రీలో పెద్ద కుటుంబం. డాక్టర్ రామా నాయుడు గారు ప్రొడ్యూసర్ గా ఎన్నో చిత్రాలను నిర్మించి పేరు తెచ్చుకున్నారు. ఇక సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ కాకుండా రామా నాయుడు స్టూడియో కూడా నిర్మించారు. ఇక కొడుకులు సురేష్ బాబు, వెంకటేష్ లు కూడా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. సురేష్ బాబు సినిమా ప్రొడ్యూసర్ గా మారితే వెంకటేష్ హీరోగా టాప్ హీరోస్ లో ఒకరిగా ఉన్నారు. ఇక వాళ్ళ ఇంటి నుండి ఈ తరంలో వారసుడిగా వచ్చిన రానా దగ్గుబాటి రొటీన్ కథలను కాకుండా కమర్షియల్ పంథాలో పోకుండా నటనకు ఆస్కారమున్న సినిమాలు తీస్తూ మెప్పిస్తున్నాడు. ఇక ఎప్పుడూ వివాదాల్లో ఉండని దగ్గుబాటి ఫ్యామిలీ మొదటి సారి వివాదంలో చిక్కుకున్నారు. కోర్టు దిక్కరణ కేసులో ఏమి జరగనుంది అనే విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ వివరించారు.

భూ వివాదంలో దగ్గుబాటి ఫ్యామిలీకి హై కోర్ట్ షాక్…

ఫిలిం నగర్ లో సురేష్ బాబు వెయ్యి గజాల స్థలం ఉంది. ఆఅయితే ఆ ల్యాండ్ ను ప్రమోద కుమార్ అనే వ్యక్తికి లీజుకి సురేష్ బాబు ఇవ్వగా ప్రమోద కుమార్ అనే వ్యక్తి నందకుమార్ అనే ఒక వ్యక్తికి సబ్ లీజుకి ఆ స్థలం ఇచ్చారు. అక్కడ హోటల్ అలాగే ఇతరత్రా షాప్స్ పెట్టుకున్న నందకుమార్ అనే వ్యక్తి రాజకీయ పలుకుబడి ఉన్న కారనంగా ఆ ల్యాండ్ తనదే అంటూ చెప్పుకోవడం సదరు సురేష్ బాబు వరకు చేరడంతో సబ్ లీజుకి ఎలా ఇస్తావంటూ ప్రమోద్ కుమార్ ను అడిగినా అతను స్పదించలేదు.

దీంతో జిహెచ్ఏంసీ ద్వారా సురేష్ బాబు అక్కడ షాప్స్ ను కూలగొట్టించగా నంద కుమార్ భార్య చిత్ర లేఖ కోర్ట్ ను ఆశ్రయించగా కోర్ట్ స్టే ఆర్డర్ ఇచ్చింది. అయినా కూడా జిహెచ్ఏంసీ అధికారులు కూలగొట్టడంతో కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సురేష్ బాబుని అలాగే జిగహెచ్ఏంసీ అధికారులను కోర్ట్ కు హాజరు కావాలని చెప్పింది. డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తులు కావడం వల్ల న్యాయం మీకే జరుగుతుందని అనుకుంటే ఎలా అంటూ కోర్ట్ అంటే గౌరవం లేదా అంటూ హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా బాలాజీ తెలిపారు.