Analyst Damu Balaji : రామోజీ పై సిఐడి ఐదు గంటలు, 46 ప్రశ్నలు… రామోజీని జైలుకి పంపడానికి జగన్ మాస్టర్ ప్లాన్ ఇదేనా…: అనలిస్ట్ దాము బాలజి

Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద తాజాగా సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపిస్తోంది. సుమారు 46 ప్రశ్నలు ఆయనకు సిఐడి వేసినట్లుగా సమాచారం. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

జగన్ మాస్టర్ ప్లాన్ లో భాగమే…

రామోజీ రావు గారి మీద రాజకీయ కక్ష్యలో భాగంగా ఏపీ సీఎం జగన్ కావాలనే మార్గదర్శి చిట్ ఫండ్ లో అవకతవకలు జరిగాయని కేసు వేయించి అరెస్టు చేయించాలని చూస్తున్నారంటూ రామోజీ తరుపున వాళ్ళు మాట్లాడుతున్నారు. అంతే కాకుండా మార్గదర్శిలో అవకతవకలు జరిగాయని అందులో చిట్ ఫండ్ కట్టిన ప్రజలు ఎవరూ కేసు వేయలేదు కేవలం ఒక్కో జిల్లాలో చిట్ ఫండకి సంబంధించిన ప్రభుత్వ అధికారి అందులో అవకతవకలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేసారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్న సమయంలోనే రామోజీ రావు గారి వ్యాపారాలను టార్గెట్ చేసారు. అప్పట్లో ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఈ బాధ్యత అప్పగించారు. మార్గదర్శిలో హిందూ అవిభాజ్య కుటుంబ సంస్థగా ఏర్పడింది. ఈ విషయం మీదే రాజశేఖర్ రెడ్డి సమయంలో కేసు వేశారు.

అయితే హై కోర్ట్ లో ఈ కేసు కొట్టేయగా మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీం కోర్ట్ కి వెళ్లారు. అయితే ఈ కేసులో ఏపీ గవర్నమెంట్ ఇంప్లీడ్ పిటిషన్ వేయాల్సి ఉండగా ప్రస్తుతం ఉన్న జగన్ ప్రభుత్వం వేసింది. అలా కేసు మళ్ళీ తెరమీదకు వచ్చింది. అలాగే సిఐడి దృష్టికి వెళ్లడానికి కారణం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ లోని జిల్లాకు చెందిన అధికారులు మార్గదర్శి మీద ఫిర్యాదు చెయడం వల్ల సిఐడి ఏడు కేసుల్లో A1 గా రామోజీ రావు, A2 గా మార్గదర్శి ఏండి శైలజ కిరణ్ ను పేర్కొన్నారు. మార్గదర్శిలో ప్రజల డబ్బునంతా ఇతర తమ వ్యాపారాల్లోకి అలాగే మూచ్యువల్ ఫండ్స్ లోకి మళ్ళించారని ఇది చిట్ ఫండ్స్ రూల్స్ కి విరుద్దమని పేర్కొన్నారు అంటూ బాలాజీ వివరించారు.