Rashmika: రష్మిక మందన్న పరిచయం అవసరం లేని పేరు కిరాక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె ప్రస్తుతం ఇతర భాషలలో కూడా వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా వరుస సినిమా షూటింగులతో ఎంతో బిజీగా గడుపుతో ఉన్నటువంటి రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత భారీ స్థాయిలోనే ఆస్తులను సంపాదించారని తెలుస్తోంది.
2016వ సంవత్సరంలో కిరిక్ పార్టీ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇతర భాషలలో కూడా సినిమా అవకాశాలు వచ్చాయి.కెరీర్ మొదట్లో కాస్త తక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఈమె ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకు అంటున్నారు.
రష్మిక ముందు స్టార్ కిడ్స్ కూడ పనికి రారా…
ఇక ఈమె సినిమాలు మాత్రమే కాకుండా పలు బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ అదనంగా మరికొంత డబ్బును సంపాదిస్తున్నారు.ఇలా ఈమె ఒక్కో బ్రాండ్ ను ప్రమోట్ చేయడం కోసం దాదాపు 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారని సమాచారం. ఇలా ప్రతి ఏడాది సినిమాలు ప్రమోషన్లు అంటూ 8 కోట్లకు పైగా రష్మిక సంపాదిస్తున్నారని తెలుస్తోంది.
ఇండస్ట్రీలోకి వచ్చినప్పటి నుంచి ఈమె దాదాపు 65 కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్టు సమాచారం. ఇలా 27 సంవత్సరాల వయసులోనే రష్మిక ఈ స్థాయిలో ఆస్తులు సంపాదించడం అంటే మామూలు విషయం కాదని చెప్పాలి. ఇక రష్మిక ముందు స్టార్ కిడ్స్ కూడా ఏమాత్రం పనికిరారని వారి కంటే ఈమె భారీగా సంపాదిస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈమె పుష్ప 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
దేవుడు ప్రతిచోటా ఉన్నాడనే భావన అనేక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రధానంగా వినిపిస్తుంది. అయితే అదే సమయంలో మనుషులు ఆలయాలు, మసీదులు,…
మహారాష్ట్ర తీరప్రాంతంలో ఆధ్యాత్మిక ఉత్సాహం వెల్లివిరిసింది. పాల్ఘర్ జిల్లా పరిధిలోని దుర్వేస్ గ్రామం ఇటీవల భక్తి వాతావరణంతో కళకళలాడింది. బిఎపిఎస్…
వేసవి కాలం వచ్చేసరికి శరీరంపై పడే ఒత్తిడి గణనీయంగా పెరుగుతుంది. అధిక ఉష్ణోగ్రతలు, తేమ కలిసిన పరిస్థితుల్లో గుండె ఆరోగ్యంపై…
దేశవ్యాప్తంగా ఈ ఏడాది వేసవి తీవ్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు తూర్పు, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లో…
నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలామందికి సవాలుగా మారింది. జిమ్‌కి వెళ్లాలని అనుకున్నా సమయం లేకపోవడం, పని ఒత్తిడి…
వేసవి ఎండలు తీవ్రంగా పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని చల్లబరచే సహజ ఆహారాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలో సబ్జా…