Analyst Damu Balaji : రామ్ చరణ్ ఉపాసన విషయంలో మీడియా తప్పు చేసిందా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ మెగా కోడలు ఉపాసనకు జూన్ 20 న కూతురు పుట్టింది. పాప పుట్టగానే అటు మెగా ఫ్యామిలీ లోనూ ఇటు మెగా అభిమానుల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. నిన్నటినుండి సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా వైరల్ అవుతోంది. మంగళవారం నాడు మా ఇంటికి లక్ష్మి దేవి వచ్చిందంటూ చిరంజీవి గారు మానవరాలి గురించి చెబుతూ ఆనందపడిపోయారు. అయితే ఇపుడున్న సోషల్ మీడియా ఎవరినీ వదలదు. ఇన్నిరోజులు మెగా ఇంట్లో వారసులు రాలేదని రామ్ చరణ్, ఉపాసన లను ట్రోల్ చేసారు. ఇక ఉపాసన ప్రెగ్నెంట్ అయ్యాక ఆమె గర్భవతి అయినా కడుపు కనిపించడం లేదు అంటూ సరోగసీ అంటూ ఏవేవో మాట్లాడారు. తాజాగా పుట్టిన పసిపాపను కూడా వదలడం లేదు. ఇక ఈ విషయాల గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

రామ్ చరణ్, ఉపాసన విషయంలో మీడియా అతి చేసింది…

రామ్ చరణ్, ఉపాసన తమ పెళ్ళై పదకొండేళ్లకు పాపను కన్నారు. మంగళవారం నాడు ఉపాసన గారు పాపకు జన్మనివ్వగా తెలుగు మీడియా చాలా ఓవర్ చేసిందంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు. సెలబ్రిటీ కపుల్ కాబట్టి వార్తల్లో రావడం మామూలే. అయితే అదేదో ఒక వార్త అన్నట్లు కాకుండా ప్రసవం నుండి పాప పుట్టాక జాతకాల వరకు హడావుడి చేసేసారు. దేశంలో ఎన్నో వార్తలు, సమస్యలు ఉన్నాయి వాటిని వదిలేసి అపోలో హాస్పిటల్ వద్ద నలభై కెమెరాలను ఉంచి న్యూస్ రిపోర్ట్ చేయడం మరీ అతిగా అనిపించింది అంటూ చెప్పారు.

ఈ మధ్య కాలంలో యూట్యూబ్ ప్లాట్ ఫామ్ ఎక్కువ ట్రెండ్ అవుతుందటం వల్ల మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుని వార్తలను అందిస్తున్నారు. ఒక రైతు కష్టాల గురించి వీడియో చేస్తే అందుకు తక్కువ వ్యూస్ ఉంటున్నాయి. అదే ఒక సెలబ్రిటీ విడాకులు లేక ఇలా పిల్లలు పుట్టారనో చూపిస్తే అందుకు లక్షల్లో వ్యూస్ ఉంటున్నాయి. అందుకే మీడియా కూడా ఇలాంటి ప్రాధాన్యత ఎక్కువగా లేని వార్తలను ప్రసారానికే మొగ్గు చూపుతోంది అంటూ బాలాజీ అభిప్రాయపడ్డారు.