Analyst Damu Balaji : వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుందా…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ రాజకీయాల్లో సంచలనమైన రాజకీయ హత్య వైఎస్ వివేకానంద మర్డర్. ఆయనను హత్య చేసింది ఎవరు అన్నది ఎపుడు తెలుతుందో శిక్ష ఎపుడు పడుతుందో తెలియదు కానీ కేసు విచారణ జరుగుతూ రోజుకో వ్యక్తి పేరు బయటికి వస్తోంది. ఇవన్నీ చాలవు అన్నట్లుగా ఆయనకున్న అక్రమ సంబంధాల వల్లే ఆయనని దారుణంగా చంపారంటూ మరో వాదన వినిపిస్తోంది. అప్రూవర్ గా మారి వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇక మరో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి కూడా ప్రస్తుతం బెయిల్ మీద ఉండగా అవినాష్ రెడ్డి వద్ద కేసు ఆగింది. అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేస్తుంది అంటూ వినిపిస్తున్న వార్తలను నేపథ్యంలో కోర్టు తీర్పు కీలకం కానుంది. ఇక ఈ విషయాల మీద అనలిస్ట్ దాము బాలాజీ విశ్లేషణ అందించారు.

సిబిఐ అవినాష్ రెడ్డి ని అరెస్టు చేస్తుందా…

కేసులో మొదటి నుండి అవినాష్ రెడ్డి విచారణ వద్దే కేసు ఆగుతోంది. సిబిఐ దృష్టి అవినాష్ మీదే ఉంది అయితే అతడిని అరెస్టు చేయడానికి తగిన ఆధారాలు లేవు అంటూ ఆయన తరుపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదిస్తుండగా సునీత తరుపు లాయర్లు అలాగే సిబిఐ తరుపున లాయర్లు మాత్రం అవినాష్ రెడ్డి పాత్ర హత్యలో ఉంది అని వాదిస్తున్నారు అంటూ బాలాజీ అభిప్రాయాపడ్డారు. అయితే ఇక కొద్ది రోజుల్లో కోర్టులకు వేసవి సెలవులు రావడం మళ్ళీ నెల తరువాత కోర్టులు పనిచేయనున్నందున ఈ కేసులో నేడు ఇవ్వననున్న తీర్పు కీలకంగా మారిందంటూ అభిప్రాయపడ్డారు.

ఒకవైపు అవినాష్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేయనుందని వినిపిస్తుండగా అదేమి జరగదని మారోవైపు వాదన వస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు ఒకవేళ అవినాష్ అరెస్టు అయితే నెల పాటు జైలుకి పరిమితం అవుతారు. అందుకే ముందస్తు బెయిల్ కోసం కూడా వారు రెడీగా ఉన్నట్లు సమాచారం, ఒకవేళ అరెస్టు చేస్తే వెంటనే బెయిల్ మీద బయటికి రావడానికి కూడా ఆలోచిస్తున్నారు అంటూ బాలాజీ తెలిపారు.