Dancer Jhansi: డాన్స్ కొరియోగ్రాఫర్ చైతన్య ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నాను అంటూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి మరి ఆయన నెల్లూరు క్లబ్ హోటల్లో ఆదివారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్న విషయం మనకు తెలిసిందే.ఇలా చైతన్య ఆర్థిక కారణాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారని తెలిసి పలువురు ఎంతో ఎమోషనల్ అవుతున్నారు.
ఈ క్రమంలోనే పలువురు కొరియోగ్రాఫర్లు డాన్స్ మాస్టర్లు చైతన్య మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్టులు చేస్తున్నారు.ఈ క్రమంలోనే డాన్సర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న బస్సు కండక్టర్ ఝాన్సీ సైతం సోషల్ మీడియా వేదికగా చైతన్య మృతిని తలుచుకొని ఎమోషనల్ అవుతూ చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఈ సందర్భంగా చైతన్య మృతిపై ఝాన్సీ మాట్లాడుతూ ఎందుకు ఇంత పని చేసావ్ అన్నయ్య… మీరు తీసుకున్న ఈ తొందరపాటు నిర్ణయంతో కుటుంబం మొత్తం బాధపడుతుంది.తాను డబ్బులు ఇవ్వాల్సిన వారితో కూర్చొని మాట్లాడాల్సింది తన పరిస్థితి ఇది అని చెప్పి ఉండాల్సింది.అందరూ కూడా మీతో కలిసి ప్రయాణం చేసిన వారే నా పరిస్థితి ఇది అని చెప్పి ఉంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదేమో..
మా కళాకారులు డబ్బులు ఇవ్వమని వేధించే అంత కఠినాత్ములు కాదు కానీ ఎందుకు ఇంత తొందర పడ్డావు అన్నయ్య అంటూ ఎమోషనల్ అయ్యారు.మీ దగ్గర ఉన్నా లేకపోయినా తోటి వారికి సహాయం చేసే గుణం మీది గత నాలుగు రోజుల క్రితం కూడా నేను తనని కలిసి ఒక డాన్స్ షోలో కనిపించాలనుకుంటున్నాను తనకు అవకాశం కల్పించండి అని అడిగితే తరువాత సీజన్లో తప్పకుండా అవకాశం కల్పిస్తామంటూ తనకు మాట ఇచ్చారు కానీ ఇంతలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం బాధాకరం అంటూ ఝాన్సీ ఎమోషనల్ అయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…