Surekha Vani: ప్రముఖ నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో రాణిస్తున్న సురేఖ వాణి అమ్మ, అక్క, అత్త వదిన వంటి పాత్రలలో నటిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందింది. ఇలా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉండే సురేఖ వాణి భర్త మరణం తర్వాత సినిమాలను పూర్తిగా తగ్గించేసింది. అడపాద అడపా సినిమాలలో మాత్రమే తెరమీద కనిపిస్తోంది.
తన భర్త మరణం తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న సురేఖవాణి సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. కూతురు సుప్రీత తో కలిసి సురేఖ వాణి సోషల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంకా కాదు. ఈ వయసులో కూడా కూతురికి పోటీగా మోడరన్ దుస్తులు ధరించి అందాలు ఆరబోస్తూ రచ్చ చేస్తుంది. సోషల్ మీడియాలో సురేఖ వాణి షేర్ చేసే గ్లామరస్ ఫోటోలు నిమిషాలలో వైరల్ అవుతూ ఉంటాయి.
సురేఖ వాణి చేసే ఇన్ స్టా రీల్స్ కూడా వైరల్ అవుతుంటాయి. కొన్ని సందర్భాలలో తల్లి కూతురు ఇద్దరు చేసే గ్లామర్ షో వల్ల విమర్శల పాలవుతుంటారు. ఇదిలా ఉండగా తాజాగా సురేఖవాణి తన పుట్టినరోజు సందర్భంగా కూతురితో కలిసి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలో తన భర్తని తలుచుకుంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది.
బర్త్డే రోజున సురేఖ వాణి తన భర్తని తలుచుకుంటూ ” ఈరోజు నా కళ్ళల్లో ఆనందం కన్నా నువ్వు నా పక్కన లేవు అనే బాధ నాకు ఎక్కువగా ఉంది. కానీ నీ ప్రేమ, ఆశీర్వాదాలు ఎల్లప్పటికీ నాతోనే ఉంటాయని తెలుసు. నా ప్రతి బర్తడే కి నువ్వు చేసే హడావిడి ఎలా ఉంటుందో నాకు ఇప్పటికీ గుర్తుంది. లవ్ యు ఫర్ ఎవర్.. మిస్ యూ ” అంటూ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక సురేఖ వాణి బర్తడే సందర్భంగా ఆమె అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఆమెకి బర్తడే విషెస్ తెలియజేస్తున్నారు.
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…