Analyst Damu Balaji : శ్రీచైతన్య విద్యాసంస్థల అధినేత బిఎస్ రావు కన్నుమూత… ఆయన జీవితం స్ఫూర్తి దాయకం…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ అనగానే గుర్తొచ్చే కాలేజీలు శ్రీ చైతన్య, నారాయణ. ఈ కాలేజీలలో చదువంటేనే విద్యార్థులు జైలులో ఉన్నట్లు ఫీల్ అవుతారు. నిజానికి ఈ కాలేజీల మీద అన్ని విమర్శలు ఉన్నా ఎక్కువమంది తల్లిదండ్రులు ఆ కాలేజీలలో చేర్చడానికే మొగ్గుచూపుతారు. రెండేళ్లు కఠినంగా ఉండే అక్కడ చదివి బయటికి వస్తే పిల్లల జీవితం బాగుపడుతుందని భావిస్తారు. అయితే విద్యార్థుల ఆత్మహత్యల నేపథ్యంలో అనేక విమర్శలను ఎదుర్కోంటున్న శ్రీ చైతన్య కాలేజీ నుండి ఐఐటీ కి వెళ్లే విద్యార్థులు ఎక్కువ. దాదాపు 50% మంది ఐఐటీ లో శ్రీచైతన్య విద్యార్థులే ఉంటారని అనలిస్ట్ బాలాజీ అభిప్రాయపడ్డారు. కాగా నేడు శ్రీ చైతన్య విద్యాసంస్థల అధినేత డాక్టర్ బిఎస్ రావు గారు కన్నుమూశారు. స్వతహాగా డాక్టర్ అయిన ఆయన ఎందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థలను ప్రారంభించారు, అయన ప్రస్తానం గురించి బాలాజీ వివరించారు.

దేశ అభివృద్ధిలో భాగం కావాలని…

బిఎస్ రావు గారిది విజయవాడ వద్ద చిన్న పల్లెటూరు కాగా ఆయన డాక్టర్. ఆయన భార్య కూడా డాక్టర్ కాగా ఇద్దరూ మొదట్లో విదేశాలకు వెళ్లాలని భావించినా భరత దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని భావించి ఇక్కడే ఉండిపోయారు. ఇక 1986లో మొదటి సారిగా అమ్మయిల కళాశాల కోసం వెతుకగా మంచి కాలేజీ కనిపించలేదు. దీంతో కాలేజీ పెట్టాలనే ఆలోచనతో విజయవాడ లో కాలేజీ ఏర్పాటు చేసారు. మొదట 50 మందితో మొదలయిన శ్రీ చైతన్య కాలేజీ ఆపైన 1995 నాటికి 1000 మంది విద్యార్థుల వరకు చేరింది. విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నా కాలేజీని విస్తరించాలనే ఆలోచన అప్పట్లో కలగలేదు. ఇక 2004 నాటికి విద్యార్థుల సంఖ్య పెరుగుతుండటం బ్రాంచులను విస్తరించడం చేసారు. అలా నేడు వివిధ రాష్ట్రాల్లో శ్రీ చైతన్య కాలేజీలు ఉన్నాయి. ఆయన నిరంతరం విద్యాసంస్థల గురించే ఆలోచించడం వల్ల సోషల్ లైఫ్ కి దూరమాయ్యానని బాధపడుతారంటూ బాలాజీ తెలిపారు.

అందరూ శ్రీ చైతన్య కాలేజీ ని విమర్శించినా అక్కడే చదివించాలని తల్లిదండ్రులు భావిస్తారు. విద్యను కమర్షియల్ చేసారు అంటూ విమర్శల మీద అయన మాట్లాడుతూ ఫోన్ లేకుండా ఒక మూడేళ్లు విద్యార్థి ఉండగలిగితే జీవితంలో మంచి పొజిషన్ కి వెళ్తాడని నా నమ్మకం, అందుకే మా కాలేజీలో అంత కఠినంగా వ్యవహరిస్తాము. పేద విద్యార్థులకు ఉచితంగా సీటు ఇచ్చినప్పుడు వారి మీద తెలియకుండానే ఒత్తిడి ఉంటుంది దాన్ని అధిగమిస్తే విజయం సాధస్తారని, కొంతమంది పిల్లల ఆత్మహత్యలకు కారణం ఆ ఒత్తిడే అవడం బాధాకరం అంటూ ఆయన నిజాయితీగా నిజం ఒప్పుకున్నారు అంటూ బాలాజీ తెలిపారు. ఆయన 75 ఏళ్ల వయసులో అనారోగ్యం సమస్యలతో మరణించారని తెలిపారు.