Mohan Babu: కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇండస్ట్రీలో నటుడిగా నిర్మాతగా విలన్ పాత్రలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.ఇకపోతే ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ఎదుర్కొంటూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ బాబు సైతం అలాంటి ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.
మోహన్ బాబు ఇలా ట్రోల్స్ ఎదుర్కోవడానికి కారణమేంటనే విషయానికి వస్తే ఆయన మీడియాపై చిందులు వేయడమే కారణమని తెలుస్తుంది.తాజాగా సబ్ రిజిస్టర్ వారి కార్యాలయానికి మోహన్ బాబు వచ్చారు. వారి ఆస్తులకు సంబంధించిన పనుల నిమిత్తం ఈ కార్యాలయానికి వచ్చినటువంటి ఈయనను మీడియా కవర్ చేసే ప్రయత్నం చేశారు.
ఇలా మీడియా కవర్ చేస్తున్న సమయంలో మోహన్ బాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు బుద్ధి లేదా ఆ లోగోలు లాక్కొండయ్యా అంటూ తన బాన్సర్లకు సూచించడంతో బౌన్సర్లు కాస్త అత్యుత్సాహం ప్రదర్శించారు. ఇలా మీడియా పట్ల మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేస్తూ బుద్ధి లేదా అంటూ తిట్టడంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్ ఈ వీడియో పై స్పందిస్తూ… మోహన్ బాబు పై ట్రోల్స్ చేస్తున్నారు. మీరు కలెక్షన్ కింగ్ అనిపించుకుంటే సరిపోదు మీ మాటలు కూడా అలాగే ఉండాలి మీడియా కవర్ చేస్తే మీకు వచ్చిన నష్టమేంటి.. మీరు ఒకరికి చెప్పే స్థాయిలో ఉండి ఇలా చెప్పించుకునే స్థితికి రాకండి అంటూ నేటిజన్స్ ఈ వీడియో పై కామెంట్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…