Analyst Damu Balaji : సీఐడి విచారణకు రాను… తేల్చి చెప్పిన రామోజీ రావు…: అనలిస్ట్ దాము బాలాజీ

Analyst Damu Balaji : ఈనాడు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఓనర్ అయిన రామోజీ రావు గారి మీద సిఐడి విచారణ జరగడం ఒక్కసారిగా చర్చకు దారితీసింది. సుమారు ఐదు గంటల పాటు ఆయనకు ప్రశ్నలు వేసింది సిఐడి. అయితే ఆయన విచారణలో పెద్దగా సమాధానాలు చెప్పలేదని బయటికి వినిపించింది. అయితే సిఐడి విచారణకు హాజరవుతున్నారు అనే సమయానికి అనారోగ్య కారణాలతో మార్గదర్శి ఎండి శైలజ కిరణ్ ఇంట్లో ఆయన పడుకుని ఉన్న ఫోటో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి రామోజీ రావు గారికి ఆయన కోడలు శైలజ కిరణ్ గారికి సీఐడి నోటీసుకు పంపించడం చర్చనీయాంశం అయింది. ఇక ఈ ఇష్యూ గురించి అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

విచారణకు రానని తేల్చి చెప్పిన రామోజీరావు…

ఏపీ ప్రభుత్వ సిఐడి మార్గదర్శి సీఈఓ రామోజీ రావు అలాగే మేనేజంగ్ డైరెక్టర్ శైలజ మీద ఏపీ ప్రొటెక్షన్ అఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 మరియు చిట్ ఫండ్స్ చట్టం 1982 రెండు సెక్షన్స్ కింద 76 79 అలాగే ఐపీసీ సెక్షన్స్ 120(B), (క్రిమినల్ కన్స్పిరేసీ), 409 (క్రిమినల్ బ్రీచ్ అఫ్ ట్రస్ట్), 420 (చీటింగ్) అండ్ 477(A) 34 (ఫాల్సిఫికేషన్ అఫ్ అకౌంట్స్) కేసులు నమోదు చేసింది. తాజాగా ఈ కేసులో విచారణకు హాజరు కావాలని జులై ఐదున విచారణ జరుపనున్నట్లు రామోజీ రావు అలాగే శైలజ కిరణ్ ఇద్దరికీ సీఐడి నోటీసులు జారీ చేయడం జరిగాయి. అయితే విచారణకు తాను హాజరు కానని రామోజీ రావు సీఐడి అధికారులకు తేల్చి చెప్పినట్లు అనలిస్ట్ బాలాజీ తెలిపారు.

అయితే ఇప్పటికే కేసులో విచారించినా పెద్దగా రామోజీ రావు గారి నుండి సమాధానాలను పోలీసులు రాబట్టలేక పోయారు. ఇప్పుడు మరోసారి విచారణలో ఏం జరగనుందో చూడాలి అంటూ బాలాజీ తెలిపారు. అయితే మార్గదర్శి కి వేల మంది కస్టమర్స్ ఉండగా ఒకరు ఫిర్యాదు చేయనపుడు ఎందుకు కేసులు పెట్టి విచారస్తున్నారు అంటూ రామోజీ రావు తరుపు లాయర్ ప్రశ్నిస్తుండగా ఎవరూ కేసు పెట్టకపోయినా చట్ట అతిక్రమణ పనులు చేసినపుడు కేసు వేస్తారని బాలాజీ తెలిపారు. అలా వదిలేస్తే ఇండియాలోని బ్యాంకులు, మిగిలిన ఆర్థిక సంస్థలు కూడా మా వినియోగదరులు ఫిర్యాదు చేయలేదు కదా మా మీద ఎందుకు చర్యలు తీసుకుంటారు అంటూ ప్రశ్నిస్తాయని బాలాజీ తెలిపారు.